టూరిజం కారవాన్లు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

టూరిజం కారవాన్లు ప్రారంభం

Feb 5 2026 7:18 AM | Updated on Feb 5 2026 7:18 AM

టూరిజ

టూరిజం కారవాన్లు ప్రారంభం

భువనేశ్వర్‌: ఽరాష్ట్ర పర్యాటక రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. నగరం శివారులోని ధౌలి పాద పీఠం నుంచి ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా బుధవారం మూడు టూరిజం కారవాన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభాతి పరిడా మాట్లాడుతూ ఈ కారవాన్లలో పర్యాటకులు సహజ ప్రకృతి దృశ్యాలను ప్రశాంత వాతావరణంలో ఆస్వాదించగలుగుతారన్నారు. అనేక యూరోపియన్‌ దేశాలలో కారవాన్‌ పర్యాటకం ఆకర్షణీయ వ్యవస్థగా వెలుగొందుతోందన్నారు. భువనేశ్వర్‌ ఏకామ్రా ఎమ్మెల్యే బాబూ సింగ్‌, పర్యాటక శాఖ డైరెక్టర్‌ దీపంకర్‌ మహా పాత్రో మాట్లాడుతూ కారవాన్‌ టూరిజం సంప్రదాయ గమ్యస్థానాల పర్యటన అవధులు అధిగమించి సమతుల్య ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పడి సాంప్రదాయ పర్యాటక కేంద్రాలపై ఒత్తిడి తగ్గిస్తుందన్నారు. వ్యవస్థను పర్యాటక శాఖ వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌) మోడ్‌ కింద ప్రారంభించినట్లు ప్రకటించారు. కారవాన్‌ ఆధారిత పర్యాటక అనుభవాల కోసం హిరాకుద్‌, సిమిలిపాల్‌, దారింగ్‌బాడి, దేవ్‌మాలి, తల్సారి, పెంథా, మంగళజోడి, జిరంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇతర సహజ ప్రదేశాలు వంటి ముఖ్యమైన పర్యాటక సామర్థ్యం ఉన్న గమ్యస్థానాలను ఈ పర్యటనలో జోడించినట్లు వివరించారు. ప్రసాద్‌ పాఽఢి, అర్చన పాఽఢి తొలి టూరిజం కారవాన్‌ టికెటు కొనుగోలు చేసి పర్యటన ప్రారంభించారు. వీరివురు తొలి పర్యాటకులుగా బాలసోర్‌లోని తల్సారికి పర్యటనకు బయల్దేరారు.

టూరిజం కారవాన్లు ప్రారంభం1
1/2

టూరిజం కారవాన్లు ప్రారంభం

టూరిజం కారవాన్లు ప్రారంభం2
2/2

టూరిజం కారవాన్లు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement