చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

Feb 5 2026 7:18 AM | Updated on Feb 5 2026 7:18 AM

చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

క్యాన్సర్‌ అవగాహన ర్యాలీలో వక్తలు

పర్లాకిమిడి: చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్యాన్సర్‌ రోగం నుంచి ప్రజలు విముక్తి పొందాలని వక్తలు పిలుపునిచ్చారు. మద్యపానం, గుట్కా, ఇతర మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలంటూ బుధవారం శ్రీజగన్నాథ మందిరం నుంచి ర్యాలీని జిల్లా న్యాయలయం పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాజేష్‌ కుమార్‌ మిశ్రా ప్రారంభించారు. ర్యాలీలో ప్రగతిశీల సంఘటన్‌ అధ్యక్షులు లోకనాథ మిశ్రా, కార్యదర్శి తనూజా శతపథి, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యంగా జగన్నాథ మందిరం, ఇతర ప్రార్థనాలయాల వద్ద గుట్కా, మద్యం సేవించరాదని రాజేష్‌ కుమార్‌ మిశ్రా అన్నారు. ర్యాలీలో ప్రభుత్వ ఆడ్వకేటు సౌమ్యరంజన్‌ పట్నాయక్‌, బినోదిని సైన్స్‌ కళాశాల అధ్యక్షులు మనోజ్‌ పట్నాయక్‌, సమాజసేవక్‌ గిరీష్‌ పాలో, కై లాష్‌ బిశ్వాల్‌, హరిమోహన్‌ పట్నాయక్‌ నియాతీ, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement