ఆడుకుందామని వెళ్లి.. ఇసుకలో పాతిపెట్టి | - | Sakshi
Sakshi News home page

ఆడుకుందామని వెళ్లి.. ఇసుకలో పాతిపెట్టి

Jan 30 2026 6:55 AM | Updated on Jan 30 2026 6:55 AM

ఆడుకు

ఆడుకుందామని వెళ్లి.. ఇసుకలో పాతిపెట్టి

చాలా బాధాకరం..

రాయగడ: ఆడుకుందామని నది వద్దకు తీసుకువెళ్లి ఇసుకలో పీకలోతు వరకు పాతిపెట్టిన అనంతరం దాన్ని వీడియో చిత్రీకరించి పైశాచిక ఆనందాన్ని పొందిన ఆరుగురు పిల్లలను గుణుపూర్‌ ఆదర్శ పోలీసులు గురువారం నాడు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఈ ఘటన జిల్లాలోని గుణుపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల మెరింగి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లొకి వెళితే.. ఈ నెల 25 వ తేదీన మేరింగి గ్రామంలొ గల అజ్జు సబర్‌, మిటు సబర్‌, శుక్లాంగ సబర్‌ లతొ పాటు మరో ముగ్గురు పిల్లలు అదే గ్రామంలో ఉంటున్న ఒక ఆరేళ్ల కుర్రాడిని సమీపంలో గల నది వద్దకు తీసుకువెళ్లారు. నదిలో స్నానం చేసిన అనంతరం అంతా కలసి ఆ కుర్రాడిని ఇసుకలో గుంత తీసి పీకలోతు వరకు పాతి పెట్టారు. అలా పాతిపెట్టిన అనంతరం దాన్ని వీడియో చిత్రీకరించారు. ఊపిరాడటం లేదు నన్ను విడిచిపెట్టండని ఆ కుర్రాడు మొర పెట్టుకున్నా వారు అంగీకరించలేదు. అయితే ఇదే విషయం ఇంకెవరికీ చెప్పకూడదు, ఒకవేళ చెబితే ఇదేతరహా మరోసారి గుంతలో వేసి కప్పేస్తామని బెదిరించారు. అందుకు ఆ కుర్రాడు తాను ఎవరికీ చెప్పనని అనడంతో ఆరుగురు కలసి గుంతలొ పూడ్చిన వాడిని తిరిగి బయటకు తీశారు.

ఈ వీడియో వైరల్‌ కావడంతో చూసిన బాధితుని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. జిల్లాలోని పద్మపూర్‌ సమితి ఖెదాపడ గ్రామంలొ ఉంటున్న రమేష్‌ సొబొరొ అనే వ్యక్తికి చెందిన ఆరేళ్ల కొడుకు తన తాతగారు ఉంటున్న మేరింగిలో ఉంటూ చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో తన కొడుకును ఇసుకలో పూడ్చి పైశాచికత్వం పొందుతున్న వీడియోను చూసిన రమేష్‌ గురువారం నాడు గుణుపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు అందుకు సంబంధించి అజ్జు సబర్‌, మిటు సబర్‌, శుక్లాంగ్‌ సబర్‌ అనే ముగ్గురు యువకులతో పాటు మరో ముగ్గురుని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.

తన కొడుకును ఇలా ఇసుకలో పూడ్చి పైశాచిక ఆనందాన్ని పొందిన వారిపై పొలీస్‌ స్టేషన్‌లొ ఫిర్యాదు చేశానని బాధితుడి తండ్రి రమేష్‌ సబర్‌ తెలియజేశారు. ఈ నెల 25 వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుందని అదే రోజు తన కొడుకు ఇంటికి చాలా ఆలస్యంగా వెళ్లాడని చెప్పాడు. అంతవరకు అంతా వెతికారని వివరించాడు. ఇంటికి వచ్చినా ఎవ్వరికీ తనకు జరిగిన సంఘటన గురించి సంబంధించి చెప్పలేదని అన్నారు.

ఆడుకుందామని వెళ్లి.. ఇసుకలో పాతిపెట్టి 1
1/2

ఆడుకుందామని వెళ్లి.. ఇసుకలో పాతిపెట్టి

ఆడుకుందామని వెళ్లి.. ఇసుకలో పాతిపెట్టి 2
2/2

ఆడుకుందామని వెళ్లి.. ఇసుకలో పాతిపెట్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement