వైభవంగా లక్ష్మీనృసింహ స్వామి కల్యాణోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా లక్ష్మీనృసింహ స్వామి కల్యాణోత్సవం

Feb 8 2026 3:59 AM | Updated on Feb 8 2026 3:59 AM

వైభవం

వైభవంగా లక్ష్మీనృసింహ స్వామి కల్యాణోత్సవం

కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

రాయగడ: అమలాభట్ట సమీపంలోని శ్రీక్షేత్ర టౌన్‌షిప్‌లో వెలసియున్న శ్రీలక్ష్మీనరసింహ స్వామి మందిర ద్వితీయ వార్షికోత్సవంలో భాగంగా ఈ నెల ఐదో తేదీ నుంచి కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం స్వామి వారి కల్యాణోత్సవం వైభంగా నిర్వహించారు. వేదపండితులు అయ్యవార్లం శ్రీనివాస్‌ ఆచార్యులు, ఫణిహారం భాస్కరాచార్యులు, తంతిన మోహన క్రిష్ణ, లక్ష్మణ్‌ ఆచార్యులు, రమేష్‌ ఆచార్యులు, కాండూరి జగన్నాధ ఆచార్యులు, సాకేత్‌ ఆచార్యులు, ఆలయ అర్చకులు మంగనాథ ఆచార్యుల ఆధ్వర్యంలో జరిగిన కల్యాణోత్సవంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. అంతకు ముందు ఏకశిల ధ్వజస్తంభ పూజలను సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త దూడల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శేషశయనంపై స్వామి వారు దర్శనం ఇచ్చారు. అదేవిధంగా ఉత్సవ మూర్తిని ఊరేగించారు. పూజా కార్యక్రమాలను తిలకించేందుకు భక్తుల సందడి కనిపించింది. ఈ నెల పదో తేదీ వరకు ఉత్సవాలు కొనసాగుతాయని ఆలయ ధర్మకర్త దూడల శ్రీనివాస్‌ తెలియజేశారు. ఆఖరి రోజున చూర్ణోత్సవం, కలశాభిషేకం, చక్రస్నానం, హోమ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. అదేవిధంగా అన్న ప్రసాద సేవన కార్యక్రమానికి భక్తులు హాజరు కావాలని కోరారు.

వైభవంగా లక్ష్మీనృసింహ స్వామి కల్యాణోత్సవం1
1/5

వైభవంగా లక్ష్మీనృసింహ స్వామి కల్యాణోత్సవం

వైభవంగా లక్ష్మీనృసింహ స్వామి కల్యాణోత్సవం2
2/5

వైభవంగా లక్ష్మీనృసింహ స్వామి కల్యాణోత్సవం

వైభవంగా లక్ష్మీనృసింహ స్వామి కల్యాణోత్సవం3
3/5

వైభవంగా లక్ష్మీనృసింహ స్వామి కల్యాణోత్సవం

వైభవంగా లక్ష్మీనృసింహ స్వామి కల్యాణోత్సవం4
4/5

వైభవంగా లక్ష్మీనృసింహ స్వామి కల్యాణోత్సవం

వైభవంగా లక్ష్మీనృసింహ స్వామి కల్యాణోత్సవం5
5/5

వైభవంగా లక్ష్మీనృసింహ స్వామి కల్యాణోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement