అంత్యక్రియలకు రాని సంతానం | - | Sakshi
Sakshi News home page

అంత్యక్రియలకు రాని సంతానం

Feb 1 2026 3:07 AM | Updated on Feb 1 2026 3:07 AM

అంత్యక్రియలకు రాని సంతానం

అంత్యక్రియలకు రాని సంతానం

కొరాపుట్‌: నవమాసాలు మోసి కన్న సంతానం తల్లి అంత్యక్రియలకు రాని విషాదకర ఘటన జరిగింది. శనివారం కొరాపుట్‌ జిల్లా దశమంత్‌పూర్‌ సమితి కేంద్రంలో నివసిస్తున్న రాజేశ్వరి నాయక్‌ (60) అనారోగ్యంతో ప్రభుత్వ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచింది. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారిద్దరూ వివాహాలు చేసుకుని వేరే ఊళ్లలో నివసిస్తున్నారు. తల్లి మరణ వార్త గ్రామస్తులు కుమారుడు, కుమార్తెకు తెలియజేశారు. కానీ వారిద్దరూ తాము రాలేమని చెప్పేశారు. దీంతో గ్రామస్తులే రాజేశ్వరి మృతదేహానికి అంత్య క్రియలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement