మహిళా సంఘాల నిరసన
పర్లాకిమిడి: ఒడిశాలో పూరిలో కిన్నెరను కొంతమంది హత్య చేసిన సంఘటను నిరసిస్తూ జిల్లా ట్రాన్స్‌జెండర్స్, ప్రగతి మహిళా సంఘటన్ ఆధ్వర్యంలో పాత కోర్టు జంక్షన్ వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. పూరీ జిల్లా పిప్పిలి గ్రామానికి చెంది కిన్నెర అంజలిని గుర్తుతెలియని కొంతమంది హత్య చేశారు. జిల్లాలోని కిన్నెరలంతా ఎకమై నిందితులను పట్టుకుని అరెస్టు చేసి తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో జిల్లా కిన్నెరుల సంఘం అధ్యక్షురాలు మధు బోరాడో, కార్యదర్శి జాస్మిన్ షేక్, ప్రగతి మహిళా సంఘటన్ కార్యదర్శి తనూజా శతపథి, తదితరులు పాల్గొన్నారు.


