మాల్యవంత్ కలశ యాత్ర
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లాస్థాయి మాల్యవంత్ మహోత్సవాలు ఆదివారం నుంచి అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. ఇందులో భాగంగా స్థానిక జగనాథ్ మందిరం నుంచి కలశ యాత్ర నిర్వహించారు. ముందుగా జగన్నాథ ఆలయంలో జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ ప్రత్యేక పూజాలు జరిపించి ఉత్సవాలను ప్రారంభించారు. సంప్రదాయ ఆదివాసీ నృత్య ప్రదర్శనల మధ్య భారీగా కలశ యత్రాను డీఎన్‌కే క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన మాల్యవంత్ ఉత్సవ్ మండపానికి చేరుకున్నారు. నృత్య బృందాలు జోడిశంఖ, వాయిద్యాలు, దుల్ధులిబాజా, బోండా, కోయా, పరజా, భూమియా, దురువా తదితర ఆదివాసీ తెగలకు చెందిన థింసా నృత్యాలతో రహదారులపై ఆనోందోత్సవాలు కనిపించాయి. జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్‌తోపాటు ఎస్పీ వినోద్ పటేల్, జిల్లా అటవీశాఖ అధికారి సాయికిరణ్, మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మాడ్కమి, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సమారి టంగులు, మల్కన్‌గిరి మున్సిపల్ చైర్మన్ మనోజ్ బారిక్, జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్, వేద్బ్‌ర్ ప్రధాన్, జిల్లా పరిషత్ సీఈవో దాశరధి సరాభు, జిల్లా సాంస్కృతిక అధికారి సంత్రాన్ నారాయణ పండా పాల్గొన్నారు.
మాల్యవంత్ కలశ యాత్ర


