రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ప్రారంభం
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో మూడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మఝి గురువారం వర్చువల్‌గా ప్రారంభించారు. మొత్తం ఒడిశాలో 57 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఒకేసారి ముఖ్యమంత్రి ప్రారంభించగా.. వాటిలో మూడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు గుమ్మా, నువాగడ, రాయఘడ బ్లాక్స్ ఉన్నాయి. రెవెన్యూ పట్టాలు, ఇళ్లు, భూ పట్టాలు సమితి స్థాయిలో కొనుగోళ్లపై రిజిస్ట్రేషన్ల లావాదేవీలు ఇకపై నిర్వహింవచ్చు. ప్రజలకు అతి సులువుగా రెవెన్యూ పట్టాలు అందించటంలో రెవెన్యూ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని ముఖ్యమంత్రి మఝి తన ప్రసంగంలో వెల్లడించారు. ఈ ప్రారంభోత్సవానికి మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో, జిల్లా కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్, ఏ.డి.ఎం రెవెన్యూ మునీంద్ర హనగ, డిప్యూటీ కలెక్టర్ మిథాలీ మధుమితా పాడీ, అసిస్టెంట్ కలెక్టర్ త్రినాథ సాహు, తదితరులు పాల్గొన్నారు.


