డయేరియాతో విద్యార్థిని మృతి
● మరో 30 మందికి అస్వస్థత
రాయగడ: జిల్లాలోని బిసంకటక్ సమితి చాటికొన పంచాయతీలో గల సింగులి గ్రామంలో ఉన్న నళిని విద్యామందిరం హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులు డయేరియా బారిన పడ్డారు. శుక్రవారం రాత్రి విద్యార్థులు విరేచనాలు, వాంతులతో అస్వస్థతకు గురవ్వడంతో వెంటనే వారిని బిసంకటక్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం తరలించారు. సమాచారం తెలుసుకున్న విద్యార్థులు తల్లిదండ్రులు భోరుమంటూ ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒక విద్యార్థిని తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్లిపోవడంతో శనివారం నాడు ఆమె తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందినట్లు విద్యామందిర్‌కు చెందిన ప్రధానోపాధ్యాయురాలు ఉర్మిల శతపతి తెలియజేశారు. మృతురాలు బాత్పూర్ పంచాయితీలోని కన్నతి గ్రామానికి చెందిన రాజేంద్ర ఉర్లాక కూతురు లగ్నా ఉర్లాక (9) మృతి చెందినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. అసలు ఆ రోజు రాత్రి ఏ ఆహారాన్ని విద్యార్థులు తిన్నారు అన్న ప్రశ్న తలెత్తుతుంది.
డయేరియాతో విద్యార్థిని మృతి
డయేరియాతో విద్యార్థిని మృతి


