సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం | - | Sakshi
Sakshi News home page

సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం

Feb 6 2026 7:27 AM | Updated on Feb 6 2026 7:27 AM

సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం

సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం

రాయగడ: స్థానిక మహిళా వాకర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు క్లబ్‌ సభ్యులు నిర్ణయించారు. ఈ మేరకు మిల్లర్స్‌ అసోసియేషన్‌ సమావేశం హాల్‌లో బుధవారం సాయంత్రం క్లబ్‌ అధ్యక్షురాలు పొట్టాం రమాదేవి ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో నిర్ణయించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థుల మధ్య సైన్స్‌ డేను పురస్కరించుకుని ప్రదర్శన, శరీర భాగాలు వాటి ఉపయోగకరాలు అన్న అంశంపై వ్యాసరచన పోటీలను నిర్వహించేందుకు సమావేశంలో నిర్ణయించారు. పట్టణంలో గల మా స్వగృహంలో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించాలని తీర్మానించారు. నెల వారి సమావేశంలో భాగంగా భవిష్యత్‌ ప్రణాళికలను రూపొందించి తమ క్లబ్‌ ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వస్తామని క్లబ్‌ అధ్యక్షురాలు రమాదేవి తెలియజేశారు. సమావేశంలో క్లబ్‌ కార్యదర్శి జి.మాధవి, కోశాధికారి నిర్మల పట్నాయక్‌, సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement