గ్రీవెన్స్‌సెల్‌కు వినతుల వెల్లువ
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు 38 వినతులు అందాయి. వీటిలో 27 వ్యక్తిగత, 11 సామాజిక వినతులు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ మహేశ్వర్ స్వయ్ వినతులను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని సంబంధిత విభాగాల అధికారులకు సూచించారు. జిల్లా ఎస్పీ సందిప్ సంపత్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పోడియా సమితిలో 45 వినతులు..
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా పోడియా సమితి కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 45 వినతులు అధికారులకు అందాయి. వీటిలో కొన్ని సమస్యలను అధికారులు అక్కడిక్కడే పరిష్కరించగా.. మరికొన్నింటిని పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వినోద్‌పటేల్, జిల్లా అటవీశాఖ అధికారి సాయికిరణ్, సబ్ కలెక్టర్ దూర్యధన్ భోయి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
గ్రీవెన్స్‌సెల్‌కు వినతుల వెల్లువ
గ్రీవెన్స్‌సెల్‌కు వినతుల వెల్లువ


