హాస్టల్ విద్యార్థి మృతి
రాయగడ: జిల్లాలోని సదరు సమితి పరిధిలోని బొడొఖిల్లాపదర్‌లో గల ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ఒక విద్యార్థి అస్వస్థతకు గురై మృతిచెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. మృతుడు ఆశ్రమ పాఠశాల హాస్టల్‌లో ఒకటొ తరగతి చదువుతున్న తొబిరొ మండంగిగా గుర్తించారు. అతని స్వగ్రామం పతక పాడు గ్రామంగా సమాచారం. వివరాల్లోకి వెళితే గత కొద్ది రొజులుగా తొబిరొ అస్వస్థతకు గురయ్యాడు. విద్యార్థి ఆరోగ్యం గురించి ఆరా తీసిన హాస్టల్ నిర్వాహకులు సమీపంలో గల ఏఎన్‌ఎం ద్వారా చికిత్స అందించారు. అయితే సోమవారం మధ్యాహ్నం తొబిరొ హాస్టల్లో కళ్లు తిరిగి కింద పడిపోయాడు. అనంతరం అతడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. తల్లి సునీత మండంగికి సమాచారం అందించారు. అయితే పరిస్థితి ఆందోళనకరంగా మారి తొబిరొ మృతి చెందాడు. అయితే తన కొడుకు అస్వస్థతకు గురైన విషయం తనకు తెలియదని ఆరొగ్యం బాగొలేదు ఆస్పత్రిలో చేర్చామని సొమవారం నాడు హాస్టల్ నిర్వాహకులు తెలియజేశారని, వారి నిర్లక్ష్యం కారణంగానే తన కొడుకు మృతి చెందినట్లు తల్లి ఆరోపిస్తున్నారు.


