మహిళల అభ్యున్నతే ధ్యేయం
ముఖ్యమంత్రి మోహన్ చరణ్‌మాఝి
రాయగడ: మహిళల అభ్యున్నతే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని రాష్ట్ర ముఖ్య మంత్రి మోహన్ చరణ్ మాఝి అన్నారు. స్థానిక జేఎస్‌కో మైదానంలో సొమవారం జిల్లా యంత్రాంగం నిర్వహించిన సుభద్ర మేళాను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. ముఖ్యంగా మహిళల ఆర్థిక సాధికారితకు ఎంతో దోహదపడుతున్న స్వయం సహాయక బృందాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నా యని పేర్కొన్నారు. స్వయం ఉపాధి మార్గాల కోసం బ్యాంకుల సాయంతో రుణాలు మంజూరు చేస్తున్నామని అన్నారు. రాయగడ జిల్లాలోని స్వ యం సహాయక బృందాలకు చెందిన మహిళలు స్వయం ఉపాధి మార్గాల ద్వారా అభివృద్ధి చెందిన గుర్తింపు పొందిన మహిళలను ప్రశంసించారు. వింద్యా వాసిని, సింగారి వడక, కుమారి కడ్రక, కున్ని పెడిసీ, సుశీల మండంగి అనే ఆదివాసీ మహిళలు స్వయం సహాయక బృందాల్లో చేరి స్వయం ఉపాధి మార్గంలో మహిళలకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. అనంతరం వారిని సన్మానించారు.
పారిశ్రామిక హబ్‌గా రాయగడ..
ప్రకృతి వనరులు, ఖనిజ సంపదలకు నిలయంగా మారిన రాయగడ జిల్లా భవిష్యత్‌లో పారిశ్రామిక రంగంలో మంచి విప్లవాన్ని సాధించే విధంగా అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి మాఝి అన్నారు. ఈ జిల్లా పారిశ్రామిక హబ్‌గా మారే అవకాశం ఉందని అన్నారు. ఇంఫా, ఇండాల్, ఆదిత్యా బిర్లా, ఉత్కళఅలూమిన, జేకేపేపర్ మిల్ వంటి బృహత్తర పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయని అన్నారు. వాటితో పాటు రానున్న రొజుల్లొ సుమారు 1 లక్ష కోట్ల పెట్టుబడులతో మరికొన్ని బృహత్తర పరిశ్రమలు ఈ జిల్లాలో ఏర్పాటు కానున్నట్లు ఆయన ప్రకటించారు. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు పరిశ్రమలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంతో పాటు స్థానికంగా గల నిరుద్యోగ యువతీ,యువకులకు సుమారు 80 శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలిగేలా తమ ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు.
రాయగడలో మెడికల్ కళాశాల ఏర్పాటు
వైద్య సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉన్న ఈ జిల్లాలో అత్యధిక శాతం మంది ఆదివాసీ, హరిజను లు నివసిస్తున్నారని వారి సంక్షేమ దృష్ట్యా ఈ జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు ఎంతో అవసరమని ముఖ్యమంత్రి అన్నారు. తమ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందని అన్నారు. ఇప్పటికే అన్ని సన్నాహాలు చేస్తున్నామని, త్వరలో ఈ జిల్లా ప్రజలు తీపి కబురు వింటారని అన్నారు. జిల్లాలో మౌళిక సౌకర్యా ల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా రహదారులు, తాగు,సాగు ,విద్యా, వైద్య రంగాలకు పెద్ద పీట వేస్తున్నామని అన్నారు. అంతకు ముందు జిల్లాలో సుమారు రూ.340 కోట్లతో చేపట్టనున్న 67 అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శం
కుస్థాపన చేశారు. రిమోట్ బటన్‌తో వాటి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదేవిధంగా మరో రూ.221 కోట్లతో పూర్తయిన 41 అభివృద్ధి పనులను జిల్లా ప్రజలకు అంకితం చేశారు. కార్యక్రమంలో రాయగడ, బిసంకటక్, గుణుపూర్ ఎమ్మెల్యేలు అప్పల స్వామి కడ్రక, నీలమాధవ హికక, సత్యజీత్ గొమాంగొలు వారి శాసనసభ పరిధుల్లో గల వివిధ సమస్యలకు సంబంధించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా వ్యవసాయం పైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్న ఈ ప్రాంత రైతుల సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. సాగు నీటి వనరులు ఉన్నప్పటికీ వాటిని వినియోగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అంతకు ముందు రాయగడ కలెక్టర్ అశుతొష్ కులకర్ణి, ఎస్పీ స్వాతి ఎస్.కుమార్‌లు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు టి.గోపిఆనంద్, సీని యర్ నాయకులు బసంత ఉలక, కాళీరాం మాఝి పాల్గొన్నారు.
మహిళల అభ్యున్నతే ధ్యేయం
మహిళల అభ్యున్నతే ధ్యేయం
మహిళల అభ్యున్నతే ధ్యేయం
మహిళల అభ్యున్నతే ధ్యేయం
మహిళల అభ్యున్నతే ధ్యేయం


