ఉత్సాహంగా మాల్యవంత్ మహోత్సవాలు
మల్కన్‌గిరి : మల్కన్‌గిరిలో ఆదివారం రాత్రి మాల్యవంత్ మహోత్సవాలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. 5వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయి. కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్, ఎస్పీ వినోద్ పటేల్, జిల్లా అటవీ శాఖ అధికారి సాయి కిరణ్, మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మడ్కామి, అదనపు కలెక్టర్ వేద్బ్‌ర్ అతిథులుగా హాజరయ్యారు. ఇక్కడి చరిత్ర సంప్రదాయం, కళాసంస్కృతి జీవన విధానానికి ప్రతిబింబమే మాల్యవంత్ మహోత్సవం అని అతిథులు అన్నారు. అతిథులకు జిల్లా సమాచార ప్రజాసంబంధ శాఖ అధికారి ప్రమిళా మాఝి కృతజ్ఞతలు తెలిపారు.


