బ్రహ్మోత్సవాలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Feb 6 2026 7:27 AM | Updated on Feb 6 2026 7:27 AM

బ్రహ్

బ్రహ్మోత్సవాలు ప్రారంభం

రాయగడ: సదరు సమితి అమలాభట్ట సమీపంలో గల శ్రీక్షేత్రటౌన్‌ షిప్‌లో గల లక్ష్మీనరసింహ స్వామి ద్వితీయ వార్షికోత్సవంలో భాగంగా గురువారం నుంచి బ్రహ్మోమత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు మంగనాథ్‌ ఆచార్యులు, స్థానిక కళ్యాణ వేంకటేశ్వర స్వామి మందిర ప్రధాన అర్చకుడు భాస్కరాచార్యుల ఆధ్వర్యంలో విశేష పూజలు చేపట్టారు. ఆలయ ధర్మకర్త దూడల శ్రీనివాస్‌ స్వామి వారి సేవలో నిమగ్నమయ్యారు. స్వామి వారికి పూజా సామగ్రీని తీసుకువెళ్లారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నెల 10వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి.

ట్రక్కును వెనుక నుండి ఢీకొన్న కారు డ్రైవర్‌ మృతి

భువనేశ్వర్‌: ధామ్‌నగర్‌ నుంచి భద్రక్‌ వైపు వెళుతున్న కారు ట్రక్కును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందారు. భద్రక్‌ జిల్లా బిష్ణుపూర్‌ చౌరస్తా సమీపంలోని 16వ నంబరు జాతీయ రహదారిపై గురువారం ఈ విషాద సంఘటన జరిగింది. కారులో డ్రైవర్‌ మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందడంతో అగ్నిమాపక దళం ఘటనా స్థలం చేరి సహాయక చర్యలు చేపట్టింది. కారు డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు గుర్తించి తక్షణమే ఆసుపత్రికి తరలించారు. యువకుడు ఆస్పత్రిలోనే మరణించాడని వైద్యులు ప్రకటించారు. ప్రమాదానికి గురైన కారులో మాంసం రవాణా అవుతున్నట్లు సమాచారం. దీనిపై ధామ్‌నగర్‌ ఠాణా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి

రాయగడ: ఈ నెల 12వ తేదీన జరగనున్న దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జాతీయ స్థాయి ఉపాధ్యక్షుడు విష్ణు చరణ్‌ మహంతి పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక కపిలాస్‌ సమీపంలో గల రాయగడ మోటార్‌ యూనియన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం శ్రామిక సంఘాలకు తీరని అన్యాయం చేస్తుందని ఆరోపించారు. కార్మికుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఈ సమ్మె 24 గంటలపాటు నిర్వహిస్తామని, ప్రజలు సహకరించాలని కోరారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చందన హరిచందన్‌, మోటార్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షుడు సునీల్‌ కుమార్‌ కర్‌, కార్యదర్శి వై.స్వామి రెడ్డి, సీఐటీయూ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు పూర్ణ చంద్ర పాడి, కార్మిక సంఘాల ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాలు ప్రారంభం 1
1/2

బ్రహ్మోత్సవాలు ప్రారంభం

బ్రహ్మోత్సవాలు ప్రారంభం 2
2/2

బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement