సెంచూరియన్‌ క్యాంపస్‌లో సేవ్‌ఫుల్‌ ఇండియా యాప్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

సెంచూరియన్‌ క్యాంపస్‌లో సేవ్‌ఫుల్‌ ఇండియా యాప్‌ ఆవిష్కరణ

Jan 31 2026 10:22 AM | Updated on Jan 31 2026 10:22 AM

సెంచూ

సెంచూరియన్‌ క్యాంపస్‌లో సేవ్‌ఫుల్‌ ఇండియా యాప్‌ ఆవిష్కర

పర్లాకిమిడి: ఆర్‌.సీతాపురం సెంచూరియన్‌ వర్సిటీ క్యాంపస్‌లో శుక్రవారం ‘సేవ్‌ఫుల్‌ ఇండియా’ యాప్‌ను ఎస్పీ జ్యోతింద్ర కుమార్‌ పండా ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు. ఈ కొత్త ఆవిష్కరణ వల్ల సామాజిక స్పృహ కలగడమే కాకుండా ప్రజలకు సామాజిక బాధ్యత కలిగేలా సేవ్‌ ఫుల్‌ ఇండియా యాప్‌ ఉంటుందని ఆస్ట్రేలియాకు చెందిన కిం మ్యాక్‌ డోనల్‌ అన్నారు. మనం కావాల్సిన దానికంటే ఎక్కువ ఆహారాన్ని వండి తర్వాత పారవేయడం కంటే వాటిని పేదలకు పంచడం, ఇంకా మిగిలితే కంపోస్ట్‌ చేయడం ద్వారా మనకు బాధ్యతాయుత స్థిరత్వం వస్తుందని యాప్‌ తయారుచేసిన ఆస్ట్రేలియా వాసులు తెలిపారు. యాప్‌ ఆవిష్కరణ ప్రారంభంలో ఆస్ట్రేలియాకు చెందిన మైక్‌ చట్టర్‌, మార్క్‌ హెల్డ్‌, వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ అనితా పాత్రో, సెంచూరియన్‌ పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ సునీతా పాణిగ్రాహి తదితరులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వం కూడా 2026 మార్చి 12న సేవ్‌ఫుల్‌ ఇండియా యాప్‌ను అధికారికంగా ఆవిష్కరిస్తారని కిం మ్యాక్‌ డోనల్‌ అన్నారు.

సెంచూరియన్‌ క్యాంపస్‌లో సేవ్‌ఫుల్‌ ఇండియా యాప్‌ ఆవిష్కర1
1/1

సెంచూరియన్‌ క్యాంపస్‌లో సేవ్‌ఫుల్‌ ఇండియా యాప్‌ ఆవిష్కర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement