అమొ సాథి యూనిఫైడ్‌ వాట్సాప్‌ చాట్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

అమొ సాథి యూనిఫైడ్‌ వాట్సాప్‌ చాట్‌ ప్రారంభం

Feb 6 2026 7:27 AM | Updated on Feb 6 2026 7:27 AM

అమొ సాథి యూనిఫైడ్‌ వాట్సాప్‌ చాట్‌ ప్రారంభం

అమొ సాథి యూనిఫైడ్‌ వాట్సాప్‌ చాట్‌ ప్రారంభం

భువనేశ్వర్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి లోక్‌ సేవా భవన్‌లో అమొ సాథి యూనిఫైడ్‌ వాట్సాప్‌ చాట్‌ను గురువారం ప్రారంభించారు. దీంతో రెవెన్యూ సేవలు చిటికెలో అందుబాటులో ఉంటాయని ముఖ్యమంత్రి ప్రకటించారు. పదే పదే తహసీల్‌ కార్యాలయానికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. రెవెన్యూ సేవలు వాట్సాప్‌ నంబర్‌ 9437292000లో అందుబాటులో ఉంటాయి.

రెవెన్యూ సేవలు సులభతరం

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట్రంలో పలు చోట్ల 57 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను ప్రారంభించారు. గత ఏడాది పాలనలో ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ సేవల రంగంలో భారీ సంస్కరణలు చేపడుతుంది. సుసంపన్న ఒడిశా, వికసిత్‌ భారత్‌ ఆవిష్కరణలో భాగంగా అట్టడుగు స్థాయిలో ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేయడం లక్ష్యంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

అమొ సాథీ యాప్‌ ద్వారా కుల ధ్రువీకరణ పత్రం, వారసత్వ ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, మ్యుటేషన్‌ కేసులు, భూమి లీజులలో వారసత్వ మార్పిడి మార్పిడి కేసు వంటి 11 ముఖ్యమైన రెవెన్యూ సేవలు అరచేతిలో అందుబాటులో ఉంటాయి. చట్టబద్ధమైన వారసులకు అనుకూలంగా భూమి రికార్డు నవీకరణతో వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను రైతులు పొందడం సులభతరమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement