పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక
పర్లాకిమిడి: 1975 మెట్రిక్యులేషన్ పూర్వపు విద్యార్థులు ఆదివారం పర్లాకిమిడి బృందావన్ ప్యాలస్‌లో కలుసుకుని సమావేశమయ్యారు. మహారాజా బాలుర ఉన్నత పాఠశాలలో 1975లో చదివి వృత్తి రీత్యా హైదరాబాద్, బెంగళూరు, బలంఘీర్, జయపురం వంటి వివిధ రాష్ట్రాలల్లో స్థిరపడిన పూర్వపు విద్యార్థులు బీఎన్ ప్యాలస్‌లో కలుసుకుని తమ అనుభవాలను పంచుకున్నారు. అనంతరం వారంతో తాము చదివిన మహారాజా బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించి అక్కడ తమ గురువులు డి.సూరప్పడు, డి.కె.జెన్నా, ఉపేంద్ర పండాలను సన్మానించారు. కార్యక్రమాన్ని భక్తవత్సల మహాపాత్రో, వి.వరదరాజు, అట్టాడ అప్పారావు, పద్మనాభ హోతాత, సత్యన్నారాయణ పండా తదితరులు విజయవంతం చేశారు.


