సామూహిక సత్యనారాయణ వ్రతాలు
కొరాపుట్: జగదల్‌పూర్ పట్టణంలోని వేంకటేశ్వర దేవాలయంలో గోదావరి జిల్లాల నుంచి వచ్చిన వేద పండితుల సమక్షంలో శనివారం సామూహిక సత్యనారాయణ వత్రాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయం ప్రతిష్ట జరిగి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రజతోత్సవాలు నిర్వహిస్తున్నారు. సామూహిక సత్యనారాయణ వ్రతాల్లో సుమారు 500పైగా దంపతులు పూజలు చేశారు. మధ్యాహ్నం సుమారు రెండు వేల మందికి ఉచిత అన్న ప్రసాద సేవనం జరిగింది. చత్తీస్‌ఘడ్ రాష్ట్ర బ్రూవర్సీస్ కార్పొరేషన్ చైర్మన్, ఆలయ ట్రస్టీ శ్రీనివాస్ మద్ది ప్రారంభ పూజల్లో పాల్గొన్నారు.
సామూహిక సత్యనారాయణ వ్రతాలు


