ఎం.ఎస్.ఎస్ ఫౌండేషన్, విక్రమ్ వర్సిటీల మధ్య ఎంవోయూ
జయపురం: జయపురం విక్రమదేవ్ విశ్వవిద్యాలయం, ఎం.ఎస్ స్వామినాథన్ రిసెర్చ్ ఫౌండేషన్ జయపురం కేంద్రాల మధ్య విద్య, అనుబంధ సహకారాన్ని స్థాపించేందుకు (ఎంవోయూ) ఒప్పదం కుదిరింది. వర్సిటీ మూడవ ప్రతిష్టా దినోత్సవం సందర్భంగా జరిగిన ఒప్పందం ప్రకారం పరస్పర సహకారం అందించుకొనేందుకు ఉభయ వర్గాలు అంగీకారానికి వచ్చాయి. ఈ ఒప్పంద కార్యక్రమం వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ డాక్టర్ దేవీప్రసాద్ మిశ్ర, రిజస్ట్రార్ మహేశ్వర్ చంద్ర నాయిక్ తదితర యూనివర్సిటీ అధికారులు, ఎం.ఎస్.స్వామినాథన్ రిసేర్చ్ ఫౌండేషన్ కేంద్ర డైరెక్టర్ ప్రశాంత కుమార్ పరిడల సమక్షంలో బుధవారం జరిగింది.. ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం విద్య, పరిశోధన సహకారం, విద్యార్థుల మార్పడి కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు మరింత బలోపేతం చేయటం, పరస్పర విద్య, పరిశోధన ఆసక్తి గల రంగాలను గుర్తించటం, విద్య, పరిశోధనలు అభివృద్ధి పరిచేందుకు అవసరమైన యాజమాన్య సహకారాలు అందించాలని నిర్ణయించారు.


