గుప్తేశ్వర శైవ పీఠం అభివృద్ధికి రూ.23.93 కోట్లు మంజూరు
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితిలో దక్షిణ ఒడిశాలో ప్రసిద్ధ శివ క్షేత్రం గుప్తేశ్వర్ సౌందర్యీకరణ, ఆ ప్రాంతాన్ని అత్యాధునికంగా తీర్చి దిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక విభాగం రూ.23.93 కోట్లు మంజూరు చేసింది. గుప్తేశ్వర్ మందిర ఆధునికీకరణతో పాటుగా ప్రాంతాన్ని అత్యంత సౌందర్యంగా తీర్చి దిద్దేందుకు, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించి భక్తులను పర్యాటకులను ఆకర్షించే విధంగా గుప్తేశ్వర్‌ను రూపొందిస్తారు. గుప్తేశ్వర్‌లో మహా శివలింగం దర్శించేందుకు రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా ఆంధ్ర ప్రదేశ్, చత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్ మొదలగు రాష్ట్రాల నుంచి ప్రతి రోజూ భక్తులు వస్తుంటారు. పర్వద పంక్తులల నడుమ ఒక గుహలో గల 6 అడుగుల పొడవు, 10 అడుగుల కై వారంతో గల అపూర్వ శివలింగం పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది.
మంచినీటి సమస్యను పరిష్కరించండి
రాయగడ: స్థానిక సాయిప్రియనగర్ 17, 18 లైన్లలో మంచినీటి సమస్య జఠిలమైంది. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆ ప్రాంత మహిళలు సాయిప్రియ మహిళా వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు పొట్టాం రమాదేవితో కలిసి కోరారు. ఈ మేరకు పీహెచ్‌డీ అధికారిని శనివారం కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ రెండు లైన్లలో దాదాపు పది కుటుంబాలకు చెందిన 50 మంది వరకు నివసిస్తున్నారని.. ఉన్న ఒక్క కుళాయి ద్వారా కూడా రెండు నెలలుగా పనిచేయకపొవడంతో తామంతా సమస్యను ఎదుర్కొంటున్నామని అన్నారు. దీనిపై స్పందించిన అధికారి వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
నూతన పాఠ్య పుస్తకాలపై ముగిసిన శిక్షణ
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మ సమితి బొరిగుమ్మ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సమగ్ర శిక్షా అభిజాన్ ద్వారా బ్లాక్‌స్థాయి పాఠ్యక్రమ రూపు రేఖ 2026, నూతన పాఠ్యపుస్తకాలపై ఉపాధ్యాయులకు ఇచ్చిన శిక్షణ శిబిరం శనివారంతో ముగిసింది. బొరిగుమ్మ బ్లాక్ సహాయ విద్యాధికారి సుభాష్ చంద్రమఝి, ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు టి.శైలజా దొరల పర్యవేక్షణలో ఐదురోజులు శిక్షణ ఇచ్చారు. నూతన పాఠ్యపుస్తక పాఠ్యాంశలపై శిక్షణ ఇచ్చినట్టు నిర్వాహకులు వెల్లడించారు. మొదటి విడతగా వందమంది ఉపాధ్యాయులు శిక్షణ పొందారన్నారు. మిగిలిన వారికి మరో విడత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని ఏబీఈవో సుభాష్ చంద్ర మఝి వెల్లడించారు. శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లను అందజేశారు. సీఆర్‌సీసీ ఆశిశ్ కుమార్‌హొత్త, బౌష్ణవనాథ్ బెహర, ఉపాధ్యాయులు రమేష్ కుమార్ నాయిక్, ఉపాధ్యాయురాలు సొనాలిస దాస్, ప్రీతిప్రాజ్ఞ సాహులు శిక్షణ ఇచ్చారు.
గుప్తేశ్వర శైవ పీఠం అభివృద్ధికి రూ.23.93 కోట్లు మంజూరు


