బాలల హక్కులు పరిరక్షించాలి | - | Sakshi
Sakshi News home page

బాలల హక్కులు పరిరక్షించాలి

Feb 8 2026 4:22 AM | Updated on Feb 8 2026 4:22 AM

బాలల హక్కులు పరిరక్షించాలి

బాలల హక్కులు పరిరక్షించాలి

బాలల హక్కులు పరిరక్షించాలి

ఆమదాలవలస: బాలల హక్కులపై చట్టసభల్లో సుదీర్ఘ చర్చలు జరపాల్సిన ఆవశ్యకత ఉందని మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. శనివారం ఆమదాలవలసలోని తన కార్యాలయంలో చైల్డ్‌ రైట్స్‌ అవేర్నెస్‌ ఫోరం రాష్ట్ర కమిటీ రూపొందించిన 2026 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల సంరక్షణ దేశానికి కీలకమన్న అంశాన్ని యావత్‌ సమాజంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తెరగాలన్నారు. బాలలపై లైంగిక దాడులు సిగ్గుచేటన్నారు. బాలల హక్కుల కమిషన్లపై రాజకీయ ఒత్తిళ్లు లేనప్పుడే సంపూర్ణ హక్కులు కాపాడవచ్చన్నారు. కార్యక్రమంలో ఫోరం వ్యవస్థాపక అధ్యక్షురాలు గొండు ధనలక్ష్మి, చైల్డ్‌ రైట్స్‌ అవేర్నెస్‌ ఫోరం రాష్ట్ర కన్వీనర్‌ గొండు సీతారాం, తొగరాం పంచాయతీ సర్పంచ్‌ తమ్మినేని వాణి సీతారాం, వైఎస్సార్‌ సీపీ యువనేత తమ్మినేని చిరంజీవి నాగ్‌, ఫోరం శ్రీకాకుళం ప్రతినిధులు కొత్తకోట శ్రీనివాస్‌, మొదలవలస వాసుదేవకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement