ఘనంగా వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం

Jan 31 2026 10:25 AM | Updated on Jan 31 2026 10:25 AM

ఘనంగా వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం

ఘనంగా వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం

పర్లాకిమిడి: స్థానిక కోమటివీధి వద్ద వేంకటేశ్వర స్వామి వార్షిక కల్యాణ మహోత్సవం గురువారం రాత్రి కల్యాణ మండపంలో ఘనంగా జరిపించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు పైడిఘంటం భారతీ రామారావు దంపతులు, పి.మంగమ్మ ఆధ్వర్యంలో బరాటం గోపాలం, దంపతుల ఆధ్వర్యంలో భద్రం కృష్ణమోహనాచార్యులు, భద్రం శ్రీనివాసాచార్యులు పర్యవేక్షణలో ఘనంగా జరిపించారు. పట్టణంలోని మహిళలు పెద్ద ఎత్తున వేంకటేశ్వర స్వామి పద్మావతిల కల్యాణ మహోత్సవం కనులారా చూసి తరించారు.

సామూహిక

సత్యనారాయణ వ్రతాలు

పర్లాకిమిడి: స్థానిక తెలుగు సోండివీధి వద్ద గల సత్యనారాయణ మందిరంలో శుక్రవారం సామూహిక సత్యనారాయణ వ్రతాలను పులఖండం ప్రసాద్‌ బాబ్జీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 25 మంది దంపతులు వ్రతాల్లో పాల్గొని స్వామివారి ప్రత్యే పూజలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement