‘అపేక్షా’ యూనిట్‌ సందడి | - | Sakshi
Sakshi News home page

‘అపేక్షా’ యూనిట్‌ సందడి

Feb 7 2026 2:56 PM | Updated on Feb 7 2026 2:56 PM

‘అపేక్షా’ యూనిట్‌ సందడి

‘అపేక్షా’ యూనిట్‌ సందడి

రాయగడ: స్థానిక వీక్‌ సెంట్రల్‌ హాల్‌లో ఒడియా చలన చిత్రం అపేక్షా ప్రీమియర్‌ షోను శుక్రవారం ప్రదర్శించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ పట్టణంలో సందడి చేసింది. ప్రేమకథా ఇతివృత్తతో వినూత్నంగా ఈ చిత్రాన్ని చిత్రీకరించినట్లు సంగీత దర్శకులు వైద్యనాథ్‌ దాస్‌ తెలియజేశారు. ప్రీమియర్‌ షోకు ప్రముఖ గాయకుడు హ్యూమన్‌ సాగర్‌ తల్లి సినిమా హాల్‌లొ రిబ్బన్‌ కట్‌ చేసి మొదటి టిక్కెట్‌ను కొనుగోలు చేశారు. ఈ సినిమాలొ హ్యూమన్‌ సాగర్‌ రెండు పాటలు పాడారు. చిత్రంలోని పాటలన్నీ తరంగ్‌ మ్యూజిక్‌ ద్వారా విడుదలయ్యాయి. ప్రీమియర్‌ షోకు హాజరైన నటీనటుల్లో చౌదరి వికాష్‌ దాస్‌, ప్రదీప్‌దేవ్‌, పుష్పాపండ, శక్తిబరాల్‌, సార్ధక్‌, శుభంగి, అలివా దాస్‌, స్థానిక కళాకారుడు టునాటన్‌ టన్‌ (ప్రభాకర్‌ మిశ్రో), సుశాంత్‌, కేసీ రథ్‌ ఉన్నారు. చిత్రాన్ని స్టూడియో త్రీ సిక్స్‌ ఫైవ్‌ బ్యానర్‌పై డాక్టర్‌ కె.తమన్న నిర్మించగా, ఆనంద కుమార్‌ దర్శకత్వం వహించారు. కథ, మాటలు అశుతోష్‌ బారిక్‌, నిర్మల్‌ నాయక్‌, అరుణ్‌ మన్సీర్‌ సాహిత్యాన్ని సమకూర్చారు. దివంగత గాయకుడు హ్యూమన్‌ సాగర్‌, ఆసిమా పండ, చిరా, ఇప్సితాసాహులు పాటలు పాడారు. ప్రీమియర్‌ షో ప్రారంభానికి ముందు నటీనటులు స్థానిక రిలియన్స్‌ మార్ట్‌ నుంచి సినిమా హాల్‌ వరకు ఊరేగింపు నిర్వహించారు .

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement