5 నుంచి లక్ష్మీనృసింహుని బ్రహ్మోత్సవాలు
రాయగడ: సదరు సమితి అమలాభట్ట వద్ద గల శ్రీక్షేత్ర టౌన్‌షిప్ ప్రాంగణంలో ఉన్న శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవాలు ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి వారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు మంగానాథ్ ఆచార్యులు, ఫణి హారం భాస్కరాచార్యుల ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 10 వ తేది వరకు కొనసాగుతాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 5 సాయంత్రం 6 గంటలకు అంకురార్పణం, శ్రీవిష్ణు సహస్ర నామ స్తోత్రపారాయణం, శ్రీ విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, ఋత్విక్వరుణం, మృత్సంగ్రహణం,నీరనాజనం, మంత్రపుష్పముల పూజలు జరుగుతాయి. అదేవిధంగా 6 వ తేదీ న శాత్తుమురై, యాగశాలార్చన, వాస్తు యోగేశ్వర, మండపారాధన, మూర్తి, కుంభావహానం, ధ్వజప్రినిష్ట, నీరాజనం, మంత్రపుష్పములు, శేషవాహన సేవ, 7న విశేష హోమాలు, శ్రీసుదర్శన నారసింహ హోమం, 8న గజవాహన సేవ, 9న శ్రీలక్ష్మీ హోమం, శ్రీభూవరాహ ఇష్టి, నీరాజనం కలశారాధన, ,10న పూర్ణాహుతి, కలశాభిషేకం, చక్రస్నానం తదితర పూజా కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ ధర్మకర్త దూడల శ్రీనివాస్ తెలియజేశారు.
5 నుంచి లక్ష్మీనృసింహుని బ్రహ్మోత్సవాలు


