కేసీసీ బ్యాంక్‌ కార్యదర్శిగా ఐశ్వర్య మహంతి | - | Sakshi
Sakshi News home page

కేసీసీ బ్యాంక్‌ కార్యదర్శిగా ఐశ్వర్య మహంతి

Feb 3 2026 7:13 AM | Updated on Feb 3 2026 7:13 AM

కేసీసీ బ్యాంక్‌ కార్యదర్శిగా ఐశ్వర్య మహంతి

కేసీసీ బ్యాంక్‌ కార్యదర్శిగా ఐశ్వర్య మహంతి

కేసీసీ బ్యాంక్‌ కార్యదర్శిగా ఐశ్వర్య మహంతి

జయపురం: కొరాపుట్‌ కేంద్ర సహకార బ్యాంక్‌ జయపురం కార్యదర్శిగా సూర్యరత్న మహంతి సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. బ్యాంక్‌ మాజీ కార్యదర్శి అతుల్య కుమార మల్లిక పదవీ విరమణ అనంతరం సహకార శిక్షణ కేంద్రంలో పని చేస్తున్న సూర్యరత్న మహంతిని రాష్ట్ర ప్రభుత్వం కేసీసీ బ్యాంక్‌ కార్యదర్శిగా నియమించింది. కేసీసీ బ్యాంక్‌ పరిచాలన కమిటీ అధ్యక్షుడు ఈశ్వర చంద్ర ప్రాణిగ్రహి, సీనియర్‌ డైరెక్టర్‌ రమాకాంత రౌళో, బ్యాంక్‌ ఉద్యోగ సంఘ అధ్యక్షుడు దిగాంబర నాయిక్‌, అదనపు జనరల్‌ మేనేజర్‌ హరిశ్చంద్ర బానగాడి సమక్షంలోమాజీ కార్యదర్శి అతుల్య కుమార్‌ మల్లిక్‌ నూతన కార్యదర్శి మహంతికి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఇటీవల మరణించిన నవరంగపూర్‌ జిల్లా డిప్యూటీ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కో ఆపరేటివ్స్‌ సదానంద దాస్‌ చిత్రపటం వద్ద సంతాపం తెలిపారు. సంతాప సభలో కేసీసీ బ్యాంక్‌ అధ్యక్షుడు పాణిగ్రహి, మాజీ కార్యదర్శి, నూతన కార్యదర్శి, బ్యాంక్‌ డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement