సమావేశాన్ని బహిష్కరించిన మిల్లర్లు
పర్లాకిమిడి: ఖరీఫ్‌ఽ ధాన్యం కొనుగోళ్ల కేంద్రంలో రైతుల వద్ద నుంచి సంగ్రహిస్తున్న ధాన్యంపై సొసైటీ అధికారులు, మిల్లర్లు 3, 4 కిలోల ధాన్యం కట్ చేస్తూ రవాణా ఖర్చులు, ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 28న రస్తారోకో ఆందోళన చేసిన విషయం విదితమే. శుక్రవారం జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్యక్షతన జిల్లా పరిషత్తు హాల్‌లో రైతులు, మిల్లర్లు, సోసైటీ అధికారులతో సమావేశమైంది. ఈ సమావేశంలో సి.ఎస్.ఓ ఇన్‌చార్జి అనుప్ పండా, జిల్లా కోపరేటివ్ సొసైటీస్ అధికారి హరిహర శెఠి, తదితరులు పాల్గొన్నారు. మిల్లర్లు ధాన్యం రవాణా ఖర్చులు ఇవ్వాల్సిందిగా నవనిర్మాణ్ కృషక్ సంఘటన్ అధ్యక్షులు రంజిత్ పట్నాయిక్ సబ్‌కలెక్టర్ వద్ద డిమాండ్ చేయగా.. మిల్లర్లు అందరూ సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఈ అత్యవసర సమావేశంలో జెడ్పీటీసీ ఎస్.బాలరాజు, గణేష్ బెహరా, పి.తిరుపతిరావు, రైతు సంఘం నాయకులు సూర్యనారాయణ పట్నాయక్ పాల్గొన్నారు.


