‘కుష్టు రోగులపై వివక్ష తొలగించాలి’
పర్లాకిమిడి: ప్రపంచ కుష్టు రోగ నివారణ దినోత్సవం సందర్భంగా స్థానిక మెడికల్ రోడ్డులో గల మహారాజా డైమండ్ జుబ్లీ కుష్టురోగ పునరావాస కేంద్రంలో సెంచూరియన్ వర్సిటీ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్‌ఎన్ సంధ్య, డైరెక్టర్ (అడ్మిన్) డాక్టర్ దుర్గాప్రసాద్ పాఢి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా జిల్లా ముఖ్యవైద్యాధికారి, డీపీహెచ్‌ఓ డాక్టర్ మహామ్మద్ ముబారక్ ఆలీ, రామకృష్ణ నాయుడు, శ్రీధర్ రావు వంటి ప్రముఖులు హాజరయ్యారు. కుష్టురోగాన్ని మల్టీ డ్రగ్‌థెరపీ సహకారంతో చికిత్స జరిపి నయం చేయవచ్చునని సీడీఎంఓ డాక్టర్ అలీ అన్నారు. రోగులపై సమాజంలో వివక్షను తొలగించాల్సిన అవసరాన్ని ఆయన తెలియజేశారు. సెంచూరియన్ వర్సిటీ నర్సింగ్ విద్యార్థులు చేసిన కృషికి సీడీఎంఓ ఆలీ అభినందించారు. ఈ సందర్భంగా కుష్టు రోగ పునరావాస కేంద్రంలో ఉంటున్న రోగులకు పండ్లు డైరెక్టర్ డాక్టర్ దుర్గాప్రసాద్ పాఢి చేతులమీదుగా అందజేశారు. కార్యక్రమంలో ఫ్యాకల్టీ కోఆర్డినేటరు శుభాశ్రీ పాణిగ్రాహి, బేబీ రాణి, స్టూడెంట్స్ కోఆర్డినేటర్ శుభశ్రీ పండా తదితరులు మార్గదర్శకాలు చేశారు.


