సౌర విద్యుత్‌కు ఆదరణ
శ్రీకాకుళం: రూఫ్ టాప్ సౌర విద్యుత్తు ఏర్పాటు చేసుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు దేశాభివృద్ధికి దోహదపడవచ్చని ఆర్‌కే టెక్నాలజీస్ అధినేత పైడి చందు బుధవారం తెలిపారు. సూర్యకాంతితో విద్యుదుత్పత్తి మూలంగా కరెంట్ బిల్లు పూర్తిగా తగ్గడంతో పాటు అదనంగా ఉత్పత్తి అయిన విద్యుత్ గ్రిడ్‌కు చేరి తిరిగి వినియోగదారుడికే ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు. నిర్వహణ ఖర్చు తక్కువే కాబట్టి ప్రతి ఒక్కరూ సౌర ఫలకాలు తమ ఇళ్లపై ఏర్పాటు చేసుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీని వినియోగించుకోవాలన్నారు. ఏపీఈపీడీసీఎల్, నెడ్‌క్యాప్ అన్ని విధాలా సహకారం అందిస్తున్నాయని చెప్పారు.
నేడు దేశవ్యాప్త సమ్మె
రణస్థలం: లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలని కోరుతూ గురువారం తలపెట్టిన దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం రణస్థలం, పైడిభీమవరంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల్ని బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ, కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా ఉమ్మడిగా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని చెప్పారు. కార్యక్రమంలో సంఘ నాయకులు ఎన్.నాగేశ్వరరావు, కె.బోగేష్, బి.తోటయ్య, గురు, ఈశ్వరరావు, రమణ, రామారావు తదితరులు పాల్గొన్నారు.
గార: సర్వశిక్ష అభియాన్ పధకం కింద నియమితులైన పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్ల విషయంలో తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని సర్వశిక్షా అభియాన్ కాంట్రాక్ట్ పార్ట్‌టైమ్ టీచర్ల వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కోశాధికారి పి.వి.సత్యనారాయణ డిమాండ్ చేశారు. బుధవారం గారలో ఆయన విలేకరుతో మాట్లాడుతూ 13 ఏళ్లుగా సర్వశిక్ష అభియాన్‌లో పనిచేస్తున్న ఆర్ట్స్, క్రాప్ట్స్, వ్యాయాయ ఉపాధ్యాయులందరూ సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యాహక్కు చట్టం–2009కి లోబడి 2013 నుంచి రెగ్యులర్ చేయడంతో పాటు ఇతర ప్రయోజనాలను కల్పించాలన్నారు. పూర్తిస్థాయి ఉద్యోగులగా గుర్తించాలని కోరారు.
17న జిల్లా స్థాయి చెస్
ఎంపిక పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: శాప్ ఆదేశాల మేరకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ(డీఎస్‌ఏ) ఆధ్వర్యంలో ఈ నెల 17న శ్రీకాకుళంలో జిల్లాస్థాయి చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఎస్‌డీఓ ఎ.మహేష్‌బాబు తెలిపారు. శాంతినగర్‌కాలనీలో ఉన్న ఇండోర్ స్టేడియం వేదికగా అండర్–13, అండర్–15, అండర్–17, అండర్–19 విభాగాల్లో బాలబాలికలకు వేరువేరుగా ఎంపికలు మొదలుకానున్నాయని చెప్పారు. విజేతలగా నిలిచిన బాలురు, బాలికలను ఈ నెల 21 నుంచి జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నామని తెలిపారు. వివరాలకు 7680075375, 9390352942 నంబర్లను సంప్రదించాలని కోరారు.
ఉద్యోగాల పేరిట మోసం
హిరమండలం: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఘరానా మోసానికి పాల్పడిన వ్యక్తిని హిరమండలం పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై వి.హేమంత్ కళ్యాణ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మేజర్ పంచాయతీ హిరమండలం చిన్న కోరాడ వీధికి చెందిన బోయిన జనార్దనరావు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చి ఓ ఐదుగుర్ని మోసం చేశాడు. వారి వద్ద నుంచి రూ.13.50 లక్షలు వసూలు చేశాడు. దీనిపై బాధితుడు టి.సంతోష్ ఫిర్యాదు మేరకు హిరమండలం పోలీస్‌స్టేషన్‌లో 2025లో చీటింగ్ కేసు నమోదైంది. నిందితుడు జనార్దనరావును బుధవారం పోలీసులు అరెస్టు చేసి కొత్తూరు కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ విధించడంతో శ్రీకాకుళం జిల్లా జైలుకు తరలించారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ సూచించారు.
సౌర విద్యుత్‌కు ఆదరణ
సౌర విద్యుత్‌కు ఆదరణ


