బీజేడీ జిల్లా మహిళ అధ్యక్షురాలుగా అనసూయ | - | Sakshi
Sakshi News home page

బీజేడీ జిల్లా మహిళ అధ్యక్షురాలుగా అనసూయ

Feb 16 2026 7:52 AM | Updated on Feb 16 2026 7:52 AM

బీజేడ

బీజేడీ జిల్లా మహిళ అధ్యక్షురాలుగా అనసూయ

● రాష్ట్ర సాధారణ కార్యదర్శిగా శుభ్రపండ

● రాష్ట్ర సాధారణ కార్యదర్శిగా శుభ్రపండ

రాయగడ: ఎస్‌డీసీ మాజీ చైర్‌పర్సన్‌, బీజేడీ సీనియర్‌ నాయకురాలు అనసూయా మాఝి ఆ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. అలాగే బీజేడీ రాష్ట్ర శాఖ మహిళా సాధారణ కార్యదర్శులుగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శుభ్ర పండ, జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు సరస్వతి మాఝిలు నియమితులవ్వగా రాష్ట్ర శాఖ కార్యదర్శులుగా ఇప్పిలి నాగలక్ష్మి, సుజాత మండంగి, రజని మండంగిలు జాబితాలో ఉన్నారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఆదివారం ఈ మేరకు ప్రకటించారు. అలాగే అనుగుల్‌ జిల్లాకు మహిళా అధ్యక్షురాలుగా బబితా ప్రధాన్‌, బౌధ్‌ జిల్లాకు దీప్తిప్రభ స్వయ్‌, బరఘడ్‌కు కల్పన మాఝి, బలంగీర్‌కు గితా బిషి, దేవఘడ్‌కు అరుణి ప్రధాన్‌, గజపతికి సంజుక్త బెహర, జగత్సింగ్‌పూర్‌ జిల్లాకు లోరా మహపాత్రో, కలహండికి సబితా ప్రధాన్‌, కంధమాల్‌ జిల్లాకు పూనమ్‌ కన్హర్‌, కేంద్రపడకు సరిత సాహు, మల్కన్‌గిరికి సమారి తంగుల్‌, నవరంగపూర్‌కు మంజులా మాఝి, నువాపడకు సంతోషిణి సలమ, నయాఘడ్‌ కు బిరజాలక్ష్మీ సాహు, సంబల్‌పూర్‌కు సంసుక్త మెహర్‌, శుభం పూర్‌కు పద్మిని బఘార్‌, సుందరఘఢ్‌కు రంజన పండ, రౌర్‌కలా కు సంధ్యారాణి లక్ర, భద్రక్‌కు బిద్యుత్‌లత నాయక్‌, ఉపాధ్యాక్షురాలుగా దేవిదత్త మహాంతి, కటక్‌కు అనిత బెహర, ఉపాధ్యాక్షురాలుగా పూర్ణిమా సింగ్‌, ఢెంఖానాల్‌కు సాగరిక మిశ్ర, ఉపాధ్యాక్షురాలుగా శుభలక్ష్మీ సాహు, ఝార్సుగుడకు జయంతి బాహు, ఉపాధ్యాక్షురాలుగా పద్మిణి సింగ్‌, కేంఝర్‌కు కమలిని పాత్రో, ఉపాధ్యాక్షురాలుగా సావిత్ర శేఠి, కొరాపుట్‌ కు పార్వతీ మస్తీ, ఉపాధ్యాక్షురాలుగా ఉర్మిల ముదులి, పూరి జిల్లాకు కస్తూరా స్వయ్‌, ఉపాధ్యాక్షురాలుగా మానసి హరిచందన్‌లు నియమితులైన జాబితాలో ఉన్నారు.

అనసూయా మాఝి శుభ్రపండ

బీజేడీ జిల్లా మహిళ అధ్యక్షురాలుగా అనసూయ 1
1/1

బీజేడీ జిల్లా మహిళ అధ్యక్షురాలుగా అనసూయ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement