గుప్తేశ్వర్‌లో విదేశీ పర్యాటకులు | - | Sakshi
Sakshi News home page

గుప్తేశ్వర్‌లో విదేశీ పర్యాటకులు

Feb 16 2026 7:52 AM | Updated on Feb 16 2026 7:52 AM

గుప్త

గుప్తేశ్వర్‌లో విదేశీ పర్యాటకులు

జయపురం: జయపురం సబ్‌డివిజన్‌ బొయిపరిగుడ సమితి మారుమూల దట్టమైన అటవీ ప్రాంతంలో శబరినది ఒడ్డున పర్వత గుహలో వెలసి ఉన్న, గుప్తేశ్వరుని దర్శించేందుకు మహాశివరాత్రి నాడు మొదటి సారి విదేశీ పర్యాటకులు వచ్చారు. వారిని చూసి స్థానిక గిరిజనులు అబ్బుర పడ్డారు. కొరాపుట్‌ జిల్లాను మావో ముక్తి ప్రాంతంగా ప్రకటించటంతో నేడు శివరాత్రికి విదేశీయులు గుప్తేశ్వర్‌ వచ్చారని పరిశీలకులు తెలిపారు.

ఇద్దరు నకిలీ మావోయిస్టులు అరెస్టు

రాయగడ: ఇద్దరు నకిలీ మావోయిస్టులను పోలీసులు ఆదివారం సాయంత్రం అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో వెబ్‌ చానల్‌ రిపోర్టర్‌ అనుబ్రత బర ఉండగా మరొకరు బాలి మాఝిగా పోలీసులు గుర్తించారు. కొద్ది రోజుల క్రితం జిల్లా పోలీసుల సమక్షంలో 15 మంది మావోయిస్టులు లోంగిపొయిన సంగతి తెలిసిందే. అయితే వారు లొంగిపోయిన తరువాత జిల్లాలోని శెశిఖాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి దుమ్మాగుడ, చందిలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పాయికోపొడ, కళ్యాణసింగుపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కుంభారుగుడ ప్రాంతాల్లో ఒకే రోజు మూడు మావో బ్యానర్‌లు కలకలం సృష్టించాయి. నకిలీ మావోలు ఆ బ్యానర్‌లను ఏర్పాటు చేసినట్టు భావించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఇది నిజమని తేలడంతో వారిని అరెస్టు చేశారు. జిల్లా అదనపు ఎస్పీ, ఎస్పీ ఇన్‌చార్జి అమూల్య కుమార్‌ ధల్‌ ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సోమవారం ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించే విలేకర్ల సమావేశంలో వెల్లడిస్తారని తెలిపారు.

రచయిత నాగరాజుకు సాహితీ శిరోమణి బిరుదు ప్రదానం

రాయగడ: ప్రముఖ కవి, రచయిత, సీనియర్‌ పాత్రికేయుడు భళ్లమూడి నాగరాజుకు సాహితీ శిరోమణి బిరుదు వరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న బాపూజీ కళా మందిరంలో శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో సిక్కోలు సాహితీ సంబరాలు, జాతీయ స్థాయి శతాధిక కవి సమ్మేళనం ఆదివారం జరిగింది. ఇందులో పాల్గొన్న నాగరాజు స్వియ కవిత వినిపించారు. ఆయన రచించిన 138 కవితలు, 40 కథలు వివిధ దిన, వార, మాస పత్రికల్లో ప్రచురితమయ్యాయి. మంచి కవిగా గుర్తింపు పొందారు. ఈ కార్యక్రమంలొ శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షుడు కత్తిమండ ప్రతాప్‌, జాతీయ కార్యదర్శి పార్థశారథి, శ్రీకాకుళం విభాగం అధ్యక్షుడు మణిపాత్రుని నాగేశ్వరరావు, ఉత్తరాంధ్ర అధ్యక్షుడు డబ్బీరు గొవిందరావు, కన్వీనర్‌ భొగెల ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. దేశం నలుమూల నుంచి వందమందికి పైగా కవులు, రచయితలు కార్యక్రమంలొ పాల్గొన్నారు. గురజాడ ఫౌండేషన్‌ అమెరిక రాయగడ శాఖ వారు సాహితీ రత్న బిరుదు ప్రదానం చేశారు.

సత్తాచాటిన కిశోర్‌చంద్ర రథ్‌

పర్లాకిమిడి: ఈ నెల 13 నుంచి 15 వరకు 45వ జాతీయ ఆథ్లెటిక్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు మధ్యప్రదేశ్‌ రాష్ట్రం జబల్‌పూర్‌లోని గోకల్‌పూర్‌ ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలో జరిగాయి. ఈ పోటీల్లో గజపతి జిల్లా పర్లాకిమిడికి చెందిన సీనియర్‌ క్రీడాకారుడు, ఎకై ్సజ్‌శాఖ విశ్రాంత ఉద్యోగి కిశోర్‌చంద్ర రథ్‌ వంద మీటర్ల పరుగు పందెంలో స్వర్ణం, 400 మీటర్ల రేస్‌లో స్వర్ణం, ట్రిపుల్‌ జంప్‌లో బ్రాంజ్‌, లాంగ్‌జంప్‌లో వెండి పతకం కై వసం చేసుకున్నాడు. పర్లాకిమిడి క్రీడాకారుడు గతంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పతకాలు సాధించాడు. ఈయన విజయంపై స్థానిక క్రీడాకారులు హర్షం వెలిబుచ్చారు.

గుప్తేశ్వర్‌లో విదేశీ పర్యాటకులు 1
1/3

గుప్తేశ్వర్‌లో విదేశీ పర్యాటకులు

గుప్తేశ్వర్‌లో విదేశీ పర్యాటకులు 2
2/3

గుప్తేశ్వర్‌లో విదేశీ పర్యాటకులు

గుప్తేశ్వర్‌లో విదేశీ పర్యాటకులు 3
3/3

గుప్తేశ్వర్‌లో విదేశీ పర్యాటకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement