ఓం నమః శివాయ
భువనేశ్వర్: మహా శివ రాత్రి పర్వదినం పురస్కరించుకుని ఏకామ్ర క్షేత్రం ఆధ్యాత్మిక కాంతులతో నిండిపోయింది. లింగరాజ స్వామి ఆలయం దీపాల దివ్య వెలుగుల్లో దేదీప్యమానమై సుగంధ పుష్పాల పరిమళాలతో పరవశించింది. భక్తుల ‘ఓం నమః శివాయ’ ఘోషతో మార్మోగి, భక్తి తరంగాలు ఆలయ ప్రాంగణమంతా విరిసాయి.
ఘనంగా శివపార్వతుల కల్యాణం
జయపురం: మహాశివరాత్రి సందర్భంగా జయపురం పట్టణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శివపార్వతుల కల్యాణం ఘనంగా జరిగింది. మంగళ వాయిద్యాలతో శివుడు, పార్వతీ దేవిని తీసుకురావటం, ముహూర్తపు రాటలు వేయటం, శతమానాలను ముత్తైదువులు వెళ్లి తీసుకు రావటం సంప్రదాయకంగా నిర్వహించారు.
మార్మోగిన మహేంద్ర గిరులు
పర్లాకిమిడి: మహాశివరాత్రి పురస్కరించుకుని రాయగడ బ్లాక్ మహేంద్రగిరిలో భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి మహేశ్వరుని దర్శించుకున్నారు. మహేంద్రగిరిలో కుంతీ మందిరం వద్ద షామియానాలు ఏర్పాటుచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పోలీసులు దర్శనాలు కల్పించారు. అలాగే పర్లాకిమిడిలో మెడికల్ వద్ద అర్ధనారీశ్వర మందిరం, డోలా ట్యాంకు వద్ద రామలింగేశ్వర మందిరం, రాజవీధిలో పోడుగుకోవెల, సీతాసాగరం వద్ద మల్లికార్జున స్వామి, మడ్డువా మాధవ మందిరాల్లో భక్తులు విరివిగా దర్శించి దీపాలు వెలిగించి శివరాత్రి జాగారాలు చేశారు.
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ


