● గుప్తేశ్వర్‌లో భక్తుల కోలాహలం
జయపురం: దక్షిణ ఒడిశాలో ప్రసిద్ధ శివ క్షేత్రం జయపుర సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి గుప్తేశ్వర్ మహాశివరాత్రి దినాన శివ నామంతో ప్రతిధ్వనించింది. ఒడిశా రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా చత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ మొదలగు రాష్ట్రాల నుంచి దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు గత మూడు దినాలుగా గుప్తేశ్వర్‌కు చేరుకున్నారు. ఆదివారం గుప్తేశ్వర్ మహా శివ లింగాన్ని దర్శించేందుకు భక్తులు పోటెత్తారు. భక్తులకు దర్శనమిచ్చేందుకు శివలింగాన్ని ఆకర్షణీయంగా అలంకరించారు. కొరాపుట్ జిల్లా బ్రాహ్హణ సమాజ్ ప్రపంచ శాంతి కొరకు విశ్వశాంతి హోమం నిర్వహించారు. జయపురం దేవాలయ ధర్మాదాయ అధికారి తహసీల్దార్ సవ్యసాచి జెన, జయపురం సదర్ పోలీసు అధికారి సచీంద్ర ప్రధాన్, కుంధ్ర పోలీసు అధికారి అశ్విణీ పట్నాయిక్ గుప్తేశ్వర్ మహాశివరాత్రి వేడుకలను పర్యవేక్షిస్తున్నారు.
● గుప్తేశ్వర్‌లో భక్తుల కోలాహలం
● గుప్తేశ్వర్‌లో భక్తుల కోలాహలం
● గుప్తేశ్వర్‌లో భక్తుల కోలాహలం


