అమర వీరులకు నివాళులు
రాయగడ: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు భజరంగ దళ్, విశ్వహిందూపరిషత్ ఆధ్వర్యంలో శనివారం ఘన నివాళులు అర్పించింది. స్థానిక గాంధీ పార్క్‌లో ఈ మేరకు ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బాబూరావు మహంతి మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ దేశం పట్ల భక్తిని ,అమర వీరుల త్యాగాన్ని గుర్తు చేసుకోవాలని అన్నారు. అనంతరం పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్ల చిత్రపటాల వద్ద దీపాలు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. భజరంగ దళ్ కోఆర్డినేటర్ శంకర్ బెహర, బి.రాజేష్ పాల్గొన్నారు.


