ప్రతిభ చూపిన విద్యార్థులు
జయపురం: జయపురం పూజ్య పూజ సంసద్ 30 వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక అప్పర కొలాబ్ ప్రాజెక్టు ఉన్నత పాఠశాల ప్రాంగణంలో విద్యార్థుల మధ్య అనేక పోటీలు నిర్వహించారు. ముందుగా ఉత్కళ ఆరాధ్య దైవం శ్రీజగన్నాథ, బలభధ్ర, సుభద్ర మూర్తులకు పూజలు చేసి పోటీలు నిర్వహించారు. మూడు, నాలుగు, ఐదో తరగతుల విద్యార్థులకు దృష్టి, శ్రవణ పోటీలు నిర్వహించారు. 6 నుంచి 10 వ తరగతి విద్యార్థులకు కథలు, కవితల రచన పోటీలు నిర్వహించారు. అలాగే కళాశాల స్థాయి విద్యార్థులకు కవితా పఠన పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో పూజ్య పూజా సంసద్ అధ్యక్షుడు ఉదయ శంకర జాని, ఉపాధ్యక్షుడు తపన్ కిరణ్ తరిపాఠీ, కార్యదర్శి భైరాగి యరణ సాహు సహాయ కార్యదర్శి మృత్యుంజయ సాహు సంసద సలహాదారు ఇంజనీర్‌కేధార్ నాత్ బెహర పాల్గొని పోటీలను నిర్వహించగా న్యాయ నిర్ణేతలుగా విజయ కుమార్ భట్, సంఘ మిత్రభక్త్ , ప్రమోద్ కుమార్ రౌళో, సస్మితా పాఢి,సవితా పాఢీ తదితరులు వ్యవహరించారు.
ప్రతిభ చూపిన విద్యార్థులు


