క్యాన్సర్‌పై అవగాహన
రాయగడ: జిల్లాలోని మునిగుడకు సమీపంలో గల వేదాంత్ అలూమిన కర్మాగారం ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం అవగాహన, చైతన్య ర్యాలీని నిర్వహించారు. క్యాన్సర్ వ్యాధిని సకాలంలో గుర్తించగలిగితే నయమయ్యే అవకాశాలు ఉన్నాయని, ఏదైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే స్పందించి వైద్యులను సంప్రదించాలన్నారు. అప్రమత్తంగా వ్యవహరించాలని ప్లకార్డులు పట్టుకుని విద్యార్థులు నినాదాలు చేశారు. కర్మాగారం పరిసర ప్రాంతాల్లో ఇటువంటి తరహా కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు ఆయా ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలను తరచూ ఏర్పాటు చేస్తున్నామని కర్మాగారం సీఈఓ ప్రణబ్ కుమార్ భట్టాచార్య అన్నారు. ర్యాలీలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


