రేడియో శ్రోతల హృదయ స్పందన
భువనేశ్వర్: రేడియో వార్తల ప్రసారానికి పరిమితం కాదు. శ్రోతల హృదయ స్పందనగా మారు మోగే అద్భుత ప్రసార మాధ్యమం. రేడియో ద్వారా, సంగీతం, సాహిత్యం, గతంలోని ఎన్నో వైభవాలను శ్రావ్యంగా వీనుల విందైన ప్రసారంతో శ్రోతల హృదయాలను రంజింపజేస్తుందని ప్రముఖ ఒడిస్సీ నృత్యకారుడు, హైటెక్ గ్రూపు ఒడియా భాష అధ్యాపకుడు డాక్టర్ చిత్తరంజన్ సహాని తెలిపారు. ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా కొనసాగిన 3 రోజుల కార్యక్రమం ఔట్రీచ్ రేడియో మేళా 2026 ముగింపు ఉత్సవంలో ఆయన నృత్య అభినయం పురస్కరించుకుని ఈ సందేశం ప్రసారం చేయడం విశేషం. స్థానిక ఏకామ్ర హట్ సముదాయంలో జరిగిన ముగింపు వేడుకలో ప్రఖ్యాత అంతర్జాతీయ కథక్ నర్తకి డాక్టర్ సంగీత సాహు, యశస్విని స్వంయి, బైష్ణబి సాహు, శ్రేయ మిశ్రా, అశ్రిత సాహు, అభిలిప్సా సెఠి, సాయిసుధ సాహు అత్యున్నత స్థాయి నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధం చేశారు.


