కాసీపూర్‌లో 153 వినతుల స్వీకరణ
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి కార్యాలయంలో సోమవారం జిల్లా యంత్రాంగం నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నిహారి రంజన్ కుహోరో, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండో, జిల్లా ఎస్పీ స్వాతి ఎస్ కుమార్, సమితి అధ్యక్షుడు కంఠో మాఝి తదితరులు పాల్గొన్నారు . సమితి పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన 153 వినతులను అధికారులు స్వీకరించారు. ఇందులొ 75 వ్యక్తిగత సమస్యలుగా, 78 గ్రామ సమస్యలుగా గుర్తించారు. గ్రామ సమస్యలను పరిగణలోకి తీసుకుని వాటిని సత్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
వినతులు వెంటనే పరిష్కరించాలి
కొరాపుట్: గ్రీవెన్స్ సెల్‌లో ప్రజాఫిర్యాదులు పరిష్కారమయ్యాయి. సోమవారం నబరంగ్‌పూర్ జిల్లా డాబుగాం సమితి కేంద్రంలో జిల్లా అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. 37 ఫిర్యాదులు రాగా అందులో 15 వ్యక్తిగతం, 22 సామాజికం ఉన్నాయి. జిల్లా కలెక్టర్ మహేశ్వర్ స్వయ్ ఈ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదే కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు ఉచిత ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలో సద్భావన స్వగృహంలో జిల్లా కలెక్టర్ మనోజ్ సత్యవాన్ మహాజన్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో 32 ఫిర్యాదులు రాగా 4 సామాజిక, 28 వ్యక్తిగతం ఉన్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక బృందాలకు రు.1.75 కోట్ల విలువ గల ఆర్థిక సహాయం అందజేశారు.
కోరుకొండ గ్రీవెన్స్‌లో 69 వినతుల స్వీకరణ
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి డుడుమేట్ల పంచాయతీ కార్యాలయం ఆవరణలో సోమవారం జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్ గ్రీవెన్స్‌సెల్ నిర్వహించారు. ఈ సందర్భంగా 69 వినతులను అధికారులు స్వీకరించారు. వాటిలో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. మిగతావి క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత శాఖల సిబ్బందిని అధికారులు ఆదేశించారు. జిల్లా ఎస్పీ వినోద్ పటేల్, జిల్లా అటవీశాఖ అధికారి సాయికిరణ్, సబ్ కలెక్టర్ దూర్యోధన్ బోయి తదితరులున్నారు.
బొరిగుమ్మలో పాల సేకరణ కేంద్రం ప్రారంభం
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మ ల్యాంప్స్ ప్రాంగణంలో పాల సేకరణ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో జయపురం డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్స్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. బొయిపరిగుడ సమితిలో గల పశు పాలకులు ఎంతో కాలంగా పాల సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారని, వారి కోరిక కార్యరూపం దాల్చిందన్నారు. పాల సేకరణ కేంద్రంలో స్థానిక రైతులు, పాల ఉత్పత్తి దారులు పాలను అమ్ముకోవచ్చని తెలిపారు. ప్రథమంగా రైతు సత్యనారాయణ భంజ నుంచి పాలు కొనుగోలు చేశారు. ప్రారంభోత్సవంలో గౌరవ అతిథులుగా కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ హెడ్‌క్వార్టర్ కార్యదర్శి ఐశ్వర్య మహంతి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్స్ జయపురం రంజీన కుమార్ సాహు పాల్గొని ప్రసంగించారు.
కాసీపూర్‌లో 153 వినతుల స్వీకరణ


