శ్రీకాకుళం యాసే గుర్తింపునిచ్చింది
అరసవల్లి: శ్రీకాకుళం యాసే తమకు గుర్తింపునిచ్చిందని ప్రముఖ రీల్స్ స్టార్స్ ముప్పన శ్రీనివాస్, రమణమ్మ దంపతులు అన్నారు. ఫ్యామిలీలో జరుగుతున్న పలు ఆసక్తికరమైన, హాస్యపరమైన సంభాషణలను మన శ్రీకాకుళం యాసలోనే రీల్స్ చేస్తూ ‘సూపర్ శ్రీనివాస్’ పేరుతో నలుగురినీ నవ్వించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. మాఘమాసం ఆదివారం పురస్కరించుకొని అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. నవ్వించడమే లక్ష్యంగా సోషల్ మీడియా వేదికగా గత ఆరేళ్లుగా రీల్స్ చేస్తున్నామన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు తమను గుర్తించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తనది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని వంగర మండలం తలగాం గ్రామమని, తన భార్య రమణమ్మది వీరఘట్టం మండలంలోని బిటివాడ అని శ్రీనివాస్ తెలిపారు.


