తవుడు లోడుతో లారీ బోల్తా | - | Sakshi
Sakshi News home page

తవుడు లోడుతో లారీ బోల్తా

Feb 11 2026 7:18 AM | Updated on Feb 11 2026 7:18 AM

తవుడు

తవుడు లోడుతో లారీ బోల్తా

రాయగడ: కొరాపుట్‌ నుంచి రాయగడ మీదుగా ఆంధ్రప్రదేశ్‌ వైపు తవుడు లోడుతో వస్తున్న లారీ స్థానిక సిరికొన కూడలి వద్ద సోమవారం రాత్రి అదుపుతప్పి బోల్తా పడింది. వేగంగా వస్తున్న లారీ బ్రేకులు ఫెయిల్‌ కావడంతొ అదుపుతప్పి బోల్తా పడిందని పోలీసులు భావిస్తున్నారు. డ్రైవర్‌ స్వల్పగాయాలతో బయటపడ్డాడు.

రోడ్డెక్కిన్న రైతులు

మల్కన్‌గిరి: ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి పోట్టేర్‌ ధాన్యం కేంద్రం వద్ద సోమవారం ధర్నా చేశారు. టోకెన్‌ ఉన్నప్పటికీ ధాన్యం విక్రయం చేసుకోలేపోతున్నామని వాపోయారు. కలిమెల–మోటు ముఖ్య రహదారిపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మిల్లర్లు, పరిపాలనా అధికారుల మధ్య కుమ్మక్కు కారణంగా ధాన్యం విక్రయాలు జరగడం లేదని నిరసన తెలియజేశారు. విషయం తెలుసుకున్న కలిమెల పోలీసులు, తహసీల్దార్‌, కలిమెల సరఫరా ఇన్‌స్పెక్టర్‌ చిన్మయ్‌ సాహు, పోట్టేరు ల్యాంప్‌ ఎండీ సంఘటనా స్థలానికి చేరుకొని రైతులతో చర్చించి రహదారి క్లియర్‌ చేయించారు. రైతులతో చర్చించి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఇదే సమస్యపై లుగేల్‌ పంచాయతీ రైతులు కూడా ఇటీవల ఆందోళన చేపట్టిన విషయం విదితమే.

‘వీసీల ఖాళీలు భర్తీ చేయాలి’

భువనేశ్వర్‌: రాష్ట్రంలో అత్యధిక విశ్వ విద్యాలయాల్లో వైస్‌ చాన్స్‌లర్‌ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ పరిస్థితిపై సత్వరమే స్పందించాలని బిజూ యువ జనతాదళ్‌, ఛత్ర (విద్యార్థ) జనతా దళ్‌ ప్రతినిధి బృందం మంగళ వారం లోక్‌ భవన్‌లో గవర్నర్‌ డాక్టర్‌ హరి బాబు కంభంపాటిని కలిసి అభ్యర్థించింది. ఒడిశా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో వైస్‌ చాన్స్‌లర్ల నియామకంలో జాప్యంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. 13 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు వైస్‌ చాన్స్‌లర్లు లేకుండా కాలక్షేపం చేస్తున్నాయి. ఆయా బాధ్యతలు తాత్కాలిక అధికారులు నిర్వహిస్తు పబ్బం గడుపుతున్నారు. ఇదే తరహాలో అనేక బోధన, సహాయ ప్రొఫెసర్‌ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీ కోసం తక్షణ నియామకాలు కోరుతూ ప్రతినిధి బృందం రాష్ట్ర గవర్నర్‌కు వినతి పత్రం సమర్పించింది.

గిరిజనులకు రగ్గుల పంపిణీ

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి నక్కమాముడి పంచాయతీలోని గిరిజనులకు ప్రముఖ దిన పత్రిక సమాజ్‌ తరఫున మంగళవారం రగ్గులు పంపిణీ చేశారు . సమాజ్‌ పత్రిక రిలీఫ్‌ ఫండ్‌ ఒడిశా రాష్ట్రంలో సామాజిక సేవా సంస్థగా పనిచేస్తుంది. ఈ సంస్థను ఉత్కళమణి గోపబంధు దాస్‌ సమాజ విపత్తులు, ఆరోగ్య సమస్యలు, విద్యాఅభివృద్ధి కోసం స్థాపించారు. లోక్‌ సేవక్‌ మండల్‌, సమాజ్‌ పత్రిక రాష్ట్ర సంపాదకుడు, ప్రింటర్‌, పబ్లిషర్‌ రాజేంద్ర కుమార్‌ జేనా ఆదేశాల మేరకు జిల్లా ప్రతినిధి గోపీకృష్ణ పట్నాయాక్‌ నేతృత్వంలో రగ్గుల పంపిణీ ప్రక్రియను చేపట్టారు. నక్కమాముడి పంచాయతీలోని బయాపడా, దామోదర్‌బెఢా, సురిబెడా, తుంబాపదర్‌ తదితరగ్రామాల్లో రగులు పంపిణీ చేశారు. గతంలో కూడా గిరిశిఖర గ్రామాల్లోని ప్రజలకు సమాజ్‌ పత్రిక తరుఫున బోండఘట్టీలో రగ్గులు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో దామోధర్‌ బెఢా, వార్డు సభ్యుడు ఆర్జున్‌ ముదిలీ, కోరుకొండ ప్రతినిధి నిరంజాన్‌ మాల, కుడుములగూమ్మ ప్రతినిధి గణేష్‌దాస్‌ పాల్గొన్నారు.

తవుడు లోడుతో లారీ బోల్తా 1
1/3

తవుడు లోడుతో లారీ బోల్తా

తవుడు లోడుతో లారీ బోల్తా 2
2/3

తవుడు లోడుతో లారీ బోల్తా

తవుడు లోడుతో లారీ బోల్తా 3
3/3

తవుడు లోడుతో లారీ బోల్తా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement