ఏఐ వినియోగంపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

ఏఐ వినియోగంపై అవగాహన

Feb 12 2026 7:07 AM | Updated on Feb 12 2026 7:07 AM

ఏఐ వినియోగంపై అవగాహన

ఏఐ వినియోగంపై అవగాహన

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం రాత్రి సురక్షత ఇంటర్నెట్‌ దినోత్సవాన్ని జిల్లా అదనపు కలెక్టర్‌ వేద్బ్‌ర్‌ ప్రధాన్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఏడాది థీమ్‌గా స్మార్ట్‌టెక్‌, సేఫ్‌ చాయిసెస్‌–ఎక్స్‌ఫ్లోరింగ్‌ ది సేఫ్‌ అండ్‌ రెస్సాన్సిబుల్‌ యూజ్‌ ఆఫ్‌ ఏఐపై ప్రత్యేకంగా చర్చించారు. జిల్లా సమాచార శాస్త్రఅధికారి, జిల్లా ఈ–గవర్నెన్స్‌ మేనేజర్‌ కార్యక్రమంలో పాల్గొని ఈ దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా డిజిటల్‌ యుగంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన, సురక్షిత డిజిటల్‌ పౌరులుగా మారాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగాన్ని జాగ్రత్తగా, తెలివిగా ఎలా ఉపయోగించాలో వివరించారు. మరోవైపు జిల్లా సమాచార శాస్త్ర అధికారి ఏఐ వినియోగం వల్ల కలిగే లాభాలు, నష్టాలపై వివరంగా చర్చించారు. సైబర్‌ నేరాల నుంచి దూరంగా ఉండేందుకు ఇంటర్నెట్‌ను సురక్షితంగా ఉపయోగించాలంటూ విద్యార్థులను సూచనలు ఇచ్చారు. సబ్‌ కలెక్టర్‌ దుర్యోధన్‌ బోయి, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement