బంద్ ప్రశాంతం
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక చట్టాలు, వాణిజ్య ఒప్పందాలు, ప్రైవేటీకరణ, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు పలు కార్మిక సంఘాలు, పార్టీలు గురువారం నిర్వహించిన దేశవ్యాప్త సమ్మె రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసింది. ట్రేడ్ యూనియన్ కో–ఆర్డినేషన్ సెంటర్ (టీయూసీసీ) రాష్ట్ర కమిటీ, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఐఎన్ టీయూసీ), ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ), హింద్ మజ్దూర్ సభ (హెచ్‌ఎంఎస్), సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్(సీఐటీయూ ), ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్(ఏఐసీసీటీయూ), అనుబంధ రాజకీయ పార్టీలు సమ్మెలో పాల్గొన్నాయి. 29 కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం రద్దు చేయడాన్ని తప్పుపట్టాయి. కొత్తగా రూపొందించిన నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. – సాక్షి నెట్‌వర్క్
భువనేశ్వర్: నిర్మానుష్యంగా రహదారి


