గుప్తేశ్వర్‌లో శివనామస్మరణ | - | Sakshi
Sakshi News home page

గుప్తేశ్వర్‌లో శివనామస్మరణ

Feb 17 2026 7:41 AM | Updated on Feb 17 2026 7:41 AM

గుప్త

గుప్తేశ్వర్‌లో శివనామస్మరణ

జయపురం:

క్షిణ ఒడిశాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం జయపుర సబ్‌డివిజన్‌ బొయిపరిగుడ సమితి గుప్తేశ్వర్‌ మహాశివరాత్రి రెండో దినాన కూడా శివనామ స్మరణతో ప్రతిధ్వనించింది. గుప్తేశ్వర్‌ పర్వత గుహలో అవతరించిన అపూర్వ శివలింగాన్ని దర్శించి తరించేందుకు ఒడిశా రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా చత్తీస్‌గఢ్‌, మధ్య ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ మొదలగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు గుప్తేశ్వర్‌కు చేరుకున్నారు. ఆదివారం గుప్తేశ్వర్‌ మహా శివ లింగాన్ని దర్శించేందుకు భక్తులు పోటెత్తారు. భక్తులకు దర్శనమిచ్చేందుకు శివలింగాన్ని ఆకర్షణీయంగా అలంకరించారు. మహాశివరాత్రి వేడుకల నిర్వహణకు జిల్లా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొరాపుట్‌ జిల్లా బ్రాహ్మణ సమాజ్‌ ప్రపంచ శాంతి కోసం విశ్వశాంతి హోమం నిర్వహించారు. జయపురం దేవాలయ ధర్మాదాయ అధికారి తహసీల్దార్‌ సవ్యసాచి జెన, జయపురం సదర్‌ పోలీసు అధికారి సచీంధ్ర ప్రధాన్‌, కుంధ్ర పోలీసు అధికారి అశ్విణీ పట్నాయిక్‌ లు గుప్తేశ్వర్‌ మహాశివరాత్రి వేడుకలను పర్యవేక్షిస్తున్నారు.

గుప్తేశ్వర్‌లో శివనామస్మరణ 1
1/3

గుప్తేశ్వర్‌లో శివనామస్మరణ

గుప్తేశ్వర్‌లో శివనామస్మరణ 2
2/3

గుప్తేశ్వర్‌లో శివనామస్మరణ

గుప్తేశ్వర్‌లో శివనామస్మరణ 3
3/3

గుప్తేశ్వర్‌లో శివనామస్మరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement