గ్రీవెన్స్‌సెల్‌కు 65 వినతులు | - | Sakshi
Sakshi News home page

గ్రీవెన్స్‌సెల్‌కు 65 వినతులు

Feb 17 2026 7:41 AM | Updated on Feb 17 2026 7:41 AM

గ్రీవ

గ్రీవెన్స్‌సెల్‌కు 65 వినతులు

పర్లాకిమిడి: గజపతి జిల్లా కాశీనగర్‌ సమితి బ్లాక్‌ పంచాయతీ కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్‌ జాయింట్‌ గ్రీవెన్సు సెల్‌కు అధిక స్పందన లభించింది. ఈ గ్రీవెన్స్‌కు కలెక్టర్‌ అక్షయ సునీల్‌ అగర్వాల్‌, జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా, డీఎఫ్‌వో కె.నాగరాజు, సబ్‌ కలెక్టర్‌ అనుప్‌ పండా, జిల్లా పరిషత్‌ ఇన్‌చార్జి ముఖ్యకార్యనిర్వాహాణ అధికారి పృథ్వీరాజ్‌ మండళ్‌ తదితరులు హాజరయ్యారు. కాశీనగర్‌, కురిగాం, భిన్నల, హారిపురం గ్రామాల నుంచి 65 వినతులు వచ్చాయి. వీటిలో వ్యక్తిగతం 37, గ్రామసమస్యలకు సంబంధించినవి 28 ఉన్నాయి. గ్రీవెన్స్‌లో భాగంగా కాశీనగర్‌సమితిలో 16 మందికి కొత్తగా మధుబాబు, దివ్యాంగుల సామాజిక పింఛన్లను మంజూరు చేసి కార్డులను అందజేశారు. గ్రీవెన్స్‌కు కాశీనగర్‌ సమితి అధ్యక్షురాలు బల్లశాయమ్మ, కాశీనగర్‌ బీడీవో డంబుధర్‌ మల్లిక్‌, తహసీల్దార్‌ తదితరులు హాజరయ్యారు.

గ్రీవెన్స్‌సెల్‌కు 65 వినతులు 1
1/1

గ్రీవెన్స్‌సెల్‌కు 65 వినతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement