ప్రేమ ఫలించాలని పొర్లు దండాలు
రాయగడ: తన ప్రేమ సఫలం కావాలని కోరుతూ ఓ యువకుడు ఏకంగా నాలుగు కిలోమీటర్ల దూరం పొర్లు దండాలు పెట్టాడు. జిల్లాలోని మునిగుడ సమితి అమలాభట్ట కపిలేశ్వర మందిరం వద్ద ఇచ్ఛాపూర్ పంచాయతీలోని డంగొబాడి గ్రామానికి చెందిన గురుదాస్ డొంగిరి, మారిత డొంగిరి దంపతుల కొడుకు లొక్‌నాథ్ డొంగిరి అనే యువకుడు ఒక యువతిని ప్రేమించాడు. ఆ యువకుని ప్రేమను యువతి అంగీకరించింది. తర్వాత ఇద్దరి మధ్య మనస్ఫర్థలు వచ్చి కొన్ని నెలల కిందట విడిపోయారు. ఎంతొ గాఢంగా ప్రేమించిన ఆ యువతి అతని నుంచి దూరం కావడంతో యువకుడు మనస్తాపానికి గురయ్యాడు. ఆ యువతిపై తనకు ఉన్న ప్రేమను చాటి చెప్పేందుకు ప్రయత్నించాడు. పవిత్రమైన మహాశివరాత్రి నాడు తను ఉంటున్న ఇంటికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కపిలేశ్వర మందిరానికి పొర్లు దండాలతో వెళ్లి మొక్కుబడిని తీర్చుకుంటానని సంకల్పించి సిద్ధమయ్యాడు. అందుకు కుటుంబ సభ్యులు కూడా సహకరించడంతో శివరాత్రి రోజున ఆ యువకుడు పొర్లు దండాలతో మందిరానికి చేరుకున్నాడు. దాదాపు 8 గంటల పాటు పొర్లు దండాలు పెట్టాడు.
ప్రేమ ఫలించాలని పొర్లు దండాలు
ప్రేమ ఫలించాలని పొర్లు దండాలు


