ముగిసిన శ్రీలక్ష్మీనరసింహ బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన శ్రీలక్ష్మీనరసింహ బ్రహ్మోత్సవాలు

Feb 11 2026 7:18 AM | Updated on Feb 11 2026 7:18 AM

ముగిస

ముగిసిన శ్రీలక్ష్మీనరసింహ బ్రహ్మోత్సవాలు

ముగిసిన శ్రీలక్ష్మీనరసింహ బ్రహ్మోత్సవాలు

రాయగడ: అమలాభట్ట సమీపంలోని శ్రీక్షేత్ర టౌన్‌ షిప్‌లొ కొలువైయున్న శ్రీలక్ష్మీనృసింహ స్వామి ద్వితీయ వార్షికోత్సవంలో భాగంగా ఈ నెల ఐదో తేదీ నుంచి కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. ఉదయం సాత్తుమురై వసంతోత్సవం, చోర్ణోత్సవం, అష్టోత్తర శనకలశాభిషేకం, చక్రస్నానం ప్రధాన ఘట్టాలు జరిగియి. అలాగే స్వామి వారు గరుడ వాహనంలో ఊరేగింపుగా వెళ్లారు. కోలాటాల నడుమ కొనసాగిన గరుడ సేవ వైభవంగా ముగిసింది. మంగళవారం స్వామి వారికి విశేష హోమాలు, పూర్ణాహుతి, నీరాజనం, మంత్రపుష్పములు, పుణ్యకోటి వాహన సేవ, శ్రీపుష్పయాగం, నిత్య విశేష హోమ పూజలతో కార్యక్రమాలు పూర్తయ్యాయి. ముగింపు రోజున నిర్వహించిన స్వామివారి అన్నప్రసాదసేవలో అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉత్సవమూర్తిని సమీపంలోని నదికి తీసుకువెళ్లి చక్రస్నానం చేశారు. జలాభిషేకంతోపాటు స్వామి వారికి ప్రత్యేకంగా స్నానమాచరించారు. చక్రస్నానం పుణ్య ఘట్టంలో భక్తులు పెద్దసంఖ్యలో భాగస్వాములయ్యారు.

ముగిసిన శ్రీలక్ష్మీనరసింహ బ్రహ్మోత్సవాలు1
1/5

ముగిసిన శ్రీలక్ష్మీనరసింహ బ్రహ్మోత్సవాలు

ముగిసిన శ్రీలక్ష్మీనరసింహ బ్రహ్మోత్సవాలు2
2/5

ముగిసిన శ్రీలక్ష్మీనరసింహ బ్రహ్మోత్సవాలు

ముగిసిన శ్రీలక్ష్మీనరసింహ బ్రహ్మోత్సవాలు3
3/5

ముగిసిన శ్రీలక్ష్మీనరసింహ బ్రహ్మోత్సవాలు

ముగిసిన శ్రీలక్ష్మీనరసింహ బ్రహ్మోత్సవాలు4
4/5

ముగిసిన శ్రీలక్ష్మీనరసింహ బ్రహ్మోత్సవాలు

ముగిసిన శ్రీలక్ష్మీనరసింహ బ్రహ్మోత్సవాలు5
5/5

ముగిసిన శ్రీలక్ష్మీనరసింహ బ్రహ్మోత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement