ప్రేమకథ
న్యూస్‌రీల్
హత్యతో ముడి..
ఫ్లైఓవర్ బ్రిడ్జిపై నుంచి పడిపోయిన కారు
ప్రాణాలతో బయటపడిన డ్రైవర్
దర్యాప్తులో వెలుగు చూసిన ‘క్రిమినల్ ప్రేమకథ’
మంగళవారం శ్రీ 10 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
ప్రమాదం వెనుక..
అదే కారు..
భువనేశ్వర్: స్థానిక శిశు భవన్ కూడలి ప్రాంతం ఓవర్ బ్రిడ్జిపై సోమవారం ఉదయం ఘోర కారు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ బతికి బట్ట కట్టడం విశేషం. బారికేడ్‌ను కారు ఢీకొట్టి ఫ్లైఓవర్ నుంచి కింద పడి సమీపంలోని మురికివాడలో ఇళ్ల సముదాయంలో కుప్ప కూలింది. తృటిలో ఘోర ప్రాణ హాని తప్పింది. అయితే ఈ ప్రమాదం వెనుక ఓ క్రిమినల్ ప్రేమ కథ బయటపడడం సంచలనంగా మారింది. కారు ఓవర్ బ్రిడ్జి బారికేడ్‌ను అతి వేగంగా ఢీకొట్టి అడ్డంకులను (కంచె) ఛేదించి ఫ్లైఓవర్‌పై నుంచి కిందకు పడిపోయింది. ఈ క్రమంలో మధ్యలో ఒక చెట్టును ఢీకొని చివరికి సమీపంలోని ఇంటి పైకప్పుపై కూలింది. డ్రైవర్ ప్రమాదం నుంచి బయటపడగా అతడిని శిథిలాల నుంచి రక్షించి సత్వర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అతనికి గాయాలయ్యాయి కానీ సురక్షితంగా ఉన్నట్లు వైద్య వర్గాల సమాచారం. అతడి వివరాలను ఇంత వరకు బయటపెట్టలేదు. ఇతర ప్రాణనష్టం జరగలేదు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో భయాందోళనలకు గురిచేసింది. ఘటనా ప్రాంతంలో వాహనాల రాకపోకలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదం క్యాపిటల్ పోలీస్ ఠాణా పరిధిలోకి చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో అనేక ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ ప్రేమకథ, ఓ హత్యాయత్నం వంటి విషయాలు బయటకు వచ్చాయి.
సత్యబ్రత ఏ కారులోనైతే భువనేశ్వర్ వచ్చాడో అదే కాదు శిశు భవన్ ఓవర్ బ్రిడ్జిపై నుంచి కింద పడడం గమనార్హం. ఈ కారు పూరీ జిల్లా బ్రహ్మగిరి ప్రాంతంలో రిజిస్టర్ చేసి ఉంది. సత్యబ్రత మరణం గురించి సమాచారం అందడంతో కారు యజమాని మరో డ్రైవర్‌తో కలిసి వాహనాన్ని తిరిగి తీసుకురావడానికి భువనేశ్వర్‌కు వెళ్లాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నగరం నుంచి పారిపోయే ప్రయత్నంలో వాహనం అతి వేగంగా నడపడంతో నియంత్రణ కోల్పోయి శిశు భవన్ స్క్వేర్ వద్ద ఉన్న బారికేడ్‌ను ఢీకొట్టి ఫ్లైఓవర్ కింద ఉన్న సిమెంటు రేకుల పైకప్పుపైకి దూసుకెళ్లినట్లు దుర్ఘటన పరిసర దృశ్యాలు ధ్రువీకరిస్తున్నాయి. దీంతో పోలీసులు పోలీసులు కారు యజమాని, డ్రైవర్ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. హత్య గురించి కారు యజమానికి ఇంత త్వరగా ఎలా తెలిసిందో? నిందితుడితో అతనికి ముందస్తు సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు వర్గాలు పరిశీలిస్తున్నాయి. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇదో త్రికోణ ప్రేమ వ్యవహారంగా తెలుస్తుంది.
పూరీ జిల్లా బ్రహ్మగిరి ప్రాంతానికి చెందిన సత్యబ్రత ప్రధాన్ ఇటీవల పూర్ ప్రాంతంలోని ఓ పార్లర్‌లో పనిచేస్తున్న తన స్నేహితురాలిని కలిసేందుకు కారులో భువనేశ్వర్ వచ్చాడు. ఆ స్నేహితురాలు అనుకోని విధంగా సత్యబ్రతపై దాడి చేసి అతడి గొంతు కోసింది. జగత్‌సింగ్‌పూర్‌కు చెందిన లిజ్జా భోయ్ అనే మహిళే ఈ స్నేహితురాలిగా పోలీసులు గుర్తించారు. ఆమెకు జగత్‌సింగ్‌పూర్‌కు చెందిన దినేష్ కండి అనే వ్యక్తి సహకరించినట్లు అనుమానిస్తున్నారు. వీరిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లిజ్జాకు అనేక మందితో సంబంధాలు ఉన్నాయని సత్యబ్రతకు తెలిసి దానిపైనే ప్రశ్నించేందుకు రాగా ఈ దాడి జరిగినట్లు సమాచారం. ఈ సంఘటన జరిగిన నివాసం వెలుపల ఏర్పాటు చేసిన ిసీసీటీవీ కెమెరాలో దాడికి సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. సంఘటన స్థలంలో అనేక మంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. వారి వాంగ్మూలాలను నమోదు చేస్తున్నట్లు సమాచారం. తీవ్ర గాయాలపాలైన తర్వాత సత్యబ్రత సహాయం కోసం రోడ్డుపైకి పరిగెత్తాడు. గాయపడిన స్థితిలో ఉన్న అతన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తర్వాత సత్యబ్రత ప్రాణాలు వదిలేశాడు.
ప్రేమకథ
ప్రేమకథ
ప్రేమకథ
ప్రేమకథ
ప్రేమకథ


