చీటింగ్‌ కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

చీటింగ్‌ కేసు నమోదు

Feb 10 2026 7:21 AM | Updated on Feb 10 2026 7:21 AM

చీటిం

చీటింగ్‌ కేసు నమోదు

మెళియాపుట్టి: పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటకు చెందిన కోరాడ సంతోష్‌కుమార్‌ అనే వ్యక్తిపై మెళియాపుట్టి పోలీస్‌స్టేషన్లో చీటింగ్‌ కేసు నమోదైంది. ఎస్సై పిన్నింటి రమేష్‌బాబు తెలిపిన వివరాల మేరకు.. సంతోష్‌కుమార్‌ మెళియాపుట్టి పోలీస్‌ స్టేషన్‌లో గతంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించేవాడు. గొడ్డ గ్రామానికి చెందిన లిమ్మక గోపాలకృష్ణ అనే యువకుడికి కలెక్టరేట్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి పలు దఫాలుగా రూ.4లక్షల సొమ్ము తీసుకుని మోసం చేశాడు. ఎటువంటి ఉద్యోగం ఇప్పించకపోవడంతో బాధితుడు పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సురక్షిత ఇంటర్నెట్‌ దినోత్సవ పోస్టర్‌ ఆవిష్కరణ

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఇంటర్నెట్‌ భద్రతపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, ఎస్పీ కె.వి.మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఫిబ్రవరి 11న ‘సురక్షిత ఇంటర్నెట్‌ దినోత్సవం’ పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అవగాహన ప్రచార పోస్టర్‌ను సోమవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచి ఇంటర్నెట్‌ కోసం అనే థీమ్‌తో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ పృథ్వీరాజ్‌ కుమార్‌, డీఐఓ కిరణ్‌కుమార్‌, ఏడీఐఓ విజయబాబు, ఎల్డీఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

పాముకాటుతో వ్యక్తి మృతి

పొందూరు: సంతకవిటి మండలం సిరిపురం పంచాయతీ యాగాడిపేటకు చెందిన సీహెచ్‌ ఆనందరావు(50) సోమవారం పాము కాటుకు గురై మృతి చెందాడు. ఈయన న్యూస్‌ రిపోర్టర్‌గా పొందూరు మండలంలోని పని చేస్తున్నాడు. తుంగపేట పంచాయతీలో ఉన్న తన పొలంలో పెసరు చేను చూసేందుకు వెళ్లగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో పాముకాటు వేయడంతో చనిపోయాడు. ఈ మేరకు కుమారుడు సతీష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేశారు.

సుందరరావును అభినందించిన

కృష్ణదాస్‌

నరసన్నపేట: రావులవలసకు చెందిన పైల సుందరరావును మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ అభినందించారు. సుందరరావు గ్రూప్‌–1 పరీక్షలో సత్తా చాటి డీఎస్పీగా ఎంపికై న విషయం విదితమే. డీఎస్పీగా ఎంపికై న సుందరరావు మర్యాద పూర్వకంగా సోమవా రం ధర్మాన కృష్ణదాస్‌ను మబగాంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు కృష్ణదాస్‌ శాలువతో సత్కరించారు. నిరుపేద కుటుంబం నుంచి గ్రూప్‌–1 పరీక్షలో సత్తా చాటి ఉన్నత కొలు వు సాధించడం గొప్ప విషయమని కృష్ణదాస్‌ అన్నా రు. అలాగే సుందరరావు తండ్రి పైల రాజారావును అభినందించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు మడ్డు కృష్ణ, పంచిరెడ్డి సత్యం, పంచిరెడ్డి శివ, వెంకటేష్‌, ముద్దాడ గోపి తదితరులు పాల్గొన్నారు.

23 వరకు స్మార్ట్‌ మీటర్స్‌ పఖ్వాడా

అరసవల్లి: విద్యుత్‌ వినియోగదారులకు అత్యాధునిక సాంకేతిక సేవలు, ప్రీపెయి డ్‌ మీటర్ల వినియోగంపై అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యా ప్తంగా ‘స్మార్ట్‌ మీటర్స్‌ పఖ్వాడా’ పేరిట ఈనెల 9 నుంచి 23 వరకు పక్షోత్సవాలను నిర్వహిస్తున్నట్లుగా విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి ప్రకటించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ స్మార్ట్‌ మీటర్ల ద్వారా విద్యుత్‌ వినియోగం ఎంతమేర అవుతుందో అనే సమాచారం కూడా మొబైల్‌ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చునన్నారు. ఈ పక్షోత్సవాల్లో విద్యుత్‌ వినియోగదారుల కోసం వివిధ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు, మొబైల్‌ యాప్‌ ఇన్‌స్టాలేషన్‌ కేంద్రాలు, మీటర్ల పనితీరుపై ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించనున్నట్లుగా ఆయన వివరించారు. సందేహాల నివృత్తికి టోల్‌ఫ్రీ నంబర్‌ 1912ను కూడా సంప్రదించవచ్చునన్నారు.

చీటింగ్‌ కేసు నమోదు 1
1/1

చీటింగ్‌ కేసు నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement