హోంగార్డుతో సహా యువకుడు మృతి
కొరాపుట్: హోంగార్డుతో సహా మరో యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. సోమవారం కొరాపుట్ జిల్లా నందపూర్ ఎస్‌డీపీఓ దేవేంద్ర మాలిక్ ఈ కేసు వివరాలు ప్రకటించారు. నందపూర్ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న హోంగార్డు భగవాన్ ఖోరా (50), హీకిం పుట్ గ్రామానికి చెందిన ఉగ్రసేన్ పంగి (33) మృతి చెందినట్లు ప్రకటించారు. వీరిద్దరూ బైక్ మీద నందపూర్ నుంచి నీలదోరాపుట్ గ్రామానికి వెళ్లి కనిపించకుండాపోయారు. దీంతో రెండు కుటుంబాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలించగా నందపూర్–హందీపుట్ మార్గంలో 55వ రాష్ట్ర రహదారి పై పెటియాబాద్ వద్ద వంతెన పై బైక్ అద్దం ముక్కలు కనిపించాయి. అగ్నిమాపక సిబ్బంది సాయంతో కింద వాగులో గాలించగా బైక్ తో పాటు ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ కేసుని పోలీసులు అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు.
భగవాన్ ఖోరా ఉగ్రసేన్
హోంగార్డుతో సహా యువకుడు మృతి
హోంగార్డుతో సహా యువకుడు మృతి
హోంగార్డుతో సహా యువకుడు మృతి


