కొబ్బరి పీచు ఉత్పత్తులపై మహిళలకు అవగాహన | - | Sakshi
Sakshi News home page

కొబ్బరి పీచు ఉత్పత్తులపై మహిళలకు అవగాహన

Feb 11 2026 7:19 AM | Updated on Feb 11 2026 7:19 AM

కొబ్బరి పీచు ఉత్పత్తులపై మహిళలకు అవగాహన

కొబ్బరి పీచు ఉత్పత్తులపై మహిళలకు అవగాహన

రణస్థలం: కొబ్బరి పీచుతో తయారు చేసే ఉత్పత్తులపై మహిళలు అవగాహన కలిగి ఉండాలని కొబ్బరి పీచు పరిశ్రమ రాజమండ్రి ప్రాంతీయ కార్యాలయాధికారి వి.శ్రీబులాల్‌ అన్నారు. లావేరు మండలంలోని లావేరు కేంద్రంలో కొబ్బరి పీచు పరిశ్రమపై అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఏడాది 3,600 కోట్ల కొబ్బరి పీచు ఉత్పత్తులు(వస్తువులు) తయారు చేస్తున్నట్లు చెప్పారు. కొబ్బరి పీచు పరిశ్రమ ఏర్పాటు చేసుకునే వాళ్లకు రూ.10 వేల నుంచి రూ.5 కోట్ల వరకు రుణ సదుపాయం కల్పిస్తామని వెల్లడించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు 35 శాతం రాయితీ అందిస్తామన్నారు. కాయిర్‌తో వస్తువుల తయారీకి సంబంధించి ఉచితంగా శిక్షణలు ఇస్తున్నట్లు వివరించారు. శిక్షణ కాలంలో ప్రతీనెల రూ.3 వేల గౌరవ భృతి అందిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6 వేల మందికి పైగా ఉపాధి పొందుతున్నారని వివరించారు. ఈ ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మన రాష్ట్రంలోని రాజమండ్రి ప్రాంతీయ కార్యాలయం నుంచి డిల్లీ, హర్యానా, పంజాబ్‌, హిమచల్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో సేవలందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు 1000 వరకు ఉన్నాయన్నారు. సమావేశంలో ఏవో డి.మహేష్‌నాయుడు, ఏపీజీవీబీ మేనేజర్‌ నాగరాజు, లావేరు కొబ్బరి పీచు పరిశ్రమ అధ్యక్షులు ఇనపకుర్తి మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement